ఏకధాటిగా 15 రోజులు షూటింగ్ చేసుకున్న `2 స్టేట్స్` లక్ష్య ప్రొడక్షన్స్ , ప్రొడక్షన్స్ no.1 గా రూపొందిస్తున్న చిత్రం `2 స్టేట్స్` (వర్కింగ్ టైటిల్ ). చేతన్ భగత్ రాసిన నవల `2 స్టేట్స్` ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో అడవిశేష్, శివానీ రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెంకట్ కుంచం ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎంఎల్‌వి సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మాత. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ కోల్‌కత్తాలో ఏకధాటిగా 15 రోజులు జరిగింది. ఈ షెడ్యూల్ పూర్తయిన సందర్భంగా ... నిర్మాత ఎంఎల్‌వి సత్యనారాయణ(సత్తిబాబు) మాట్లాడుతూ - ``ఏప్రిల్ నుండి `2 స్టేట్స్` చిత్రీకరణను అనుకున్న ప్లానింగ్‌లో చక్కగా చేస్తున్నాం. హైదరాబాద్‌లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యింది. ఇటీవల కోల్‌కత్తాలో సెకండ్ షెడ్యూల్‌ను పూర్తి చేశాం. శేష్, శివాని, భాగ్యశ్రీ, రజిత్ కపూర్, లిజి, ఆదిత్య మీనన్ కాంబినేషన్‌లో కీలకమైన టాకీ సన్నివేశాలను చిత్రీకరించాం. రషెస్ చూశాం. సినిమా...