Posts

Showing posts with the label #Telugunews

నెలాఖ‌రులోగా గేటెడ్ కాల‌నీల్లో కంపోస్ట్ యూనిట్లు ఏర్పాటు చేయాలి - క‌మిష‌న‌ర్

Image
*నెలాఖ‌రులోగా గేటెడ్ కాల‌నీల్లో కంపోస్ట్ యూనిట్లు ఏర్పాటు చేయాలి - క‌మిష‌న‌ర్*   న‌గ‌రంలోని గేటెడ్ క‌మ్యునిటి కాల‌నీల్లో ఈ నెలాఖ‌రు వ‌ర‌కు సేంద్రియ ఎరువుల త‌యారీ గుంత‌ల‌ను ఏర్పాటు చేయ‌డంతో పాటు అన్ని ఇళ్ల‌లోనూ స్వ‌యంగా కంపోస్ట్ ఎరువుల త‌యారీని ప్రారంభించేలా చ‌ర్య‌ల‌ను చేప‌ట్టాల‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జనార్థ‌న్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. నేడు జీహెచ్ఎంసీ కార్యాల‌యంలో మెడిక‌ల్ ఆఫీస‌ర్లు, ట్రాన్స్‌పోర్ట్స్ ఇంజ‌నీర్ల‌తో ప్ర‌త్యేక స‌మావేశాన్ని నిర్వ‌హించారు. అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్లు శృతిఓజా, ర‌వికిర‌ణ్‌, భాస్క‌రాచారి, విజిలెన్స్ డైరెక్ట‌ర్ విశ్వ‌జిత్‌కంపాటిలు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా క‌మిష‌న‌ర్ మాట్లాడుతూ...ప్ర‌తి ఇంటి నుండి త‌డి, పొడి చెత్త‌ను వేర్వేరుగా సేక‌రించ‌డానికి ప్రాధాన్య‌త ఇస్తూనే ఇంట్లోనే ప్ర‌త్యేకంగా కంపోస్ట్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అన్నారు. ముఖ్యంగా గేటెడ్ క‌మ్యునిటి కాలనీల ల‌క్ష్యంగా కంపోస్ట్ యూనిట్ల ఏర్పాటును వంద శాతం చేప‌ట్టాల‌ని మెడిక‌ల్ ఆఫీస‌ర్ల‌ను ఆదేశించారు. త‌డి, పొడి చెత్త‌ను వేరుచేసేవారికి లాట‌రీ ద్వారా ల‌క్ష రూపాయ‌లు అంది...