జాతీయ స్థాయిలో వరుసగా మూడో ఏడాది ‘ఓవరాల్ ఛాంపియన్’ ట్రోఫీ కైవసం చేసుకున్న తెలంగాణ పోలీస్ - విజేతలను అభినందించిన డిజిపి బి. శివధర్ రెడ్డి హైదరాబాద్, ఏప్రిల్ 3 (తూఫాన్): అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్‌లో తెలంగాణ పోలీస్ విభాగం సరికొత్త చరిత్ర సృష్టించింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన 69వ జాతీయ స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్ర పోలీస్ బృందం, వరుసగా మూడో ఏడాది ‘ఓవరాల్ ఛాంపియన్’ ట్రోఫీని కైవసం చేసుకుని అద్భుతమైన హ్యాట్రిక్ సాధించింది. ఈ సందర్భంగా విజేతలను, వారికి శిక్షణ నిచ్చిన అధికారులను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర పోలీస్ విభాగం సాధించిన ఈ ఘనత తెలంగాణ కీర్తికిరీటంలో మరో మైలురాయిగా నిలుస్తుందని, అధికారుల అంకితభావం, క్రమశిక్షణే ఈ విజయానికి పునాదులని ఆయన ప్రశంసించారు. సిఐడి విభాగం ప్రత్యక్ష పర్యవేక్షణలో, నిరంతర శిక్షణతో రాటుదేలిన రాష్ట్ర బృందాలు ఈ పోటీల్లో జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలబెట్టాయి. 2023-24లో ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో, 2024-25లో జార్ఖండ్‌లోని రాంచీలో జరిగిన పోటీల్లోన...