అక్షరసేద్యం.. కవితా గానం
బుక్ ఫెయిర్‌లో ఉర్రూతలూగించిన కవి సమ్మేళనం ఆలోచింపజేసిన 'దుఃఖ నది'.. అలరించిన 'బలిపీఠం' రెండు సెషన్లలో 30 మంది కవుల కవితా గానం కవులకు సాహిత్య అకాడమీ నూతన సంవత్సర క్యాలెండర్ల పంపిణీ హైదరాబాద్:- అక్షరాల నిధి.. పుస్తకాల కాణాచి అయిన 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ గురువారం సాయంత్రం కవితా గానంతో ఉర్రూతలూగింది. ఎన్టీఆర్ స్టేడియంలోని అనిశెట్టి రజిత వేదికపై నిర్వహించిన కవి సమ్మేళనం సాహిత్యాభిమానులను మంత్రముగ్ధులను చేసింది. బుక్ ఫెయిర్ అధ్యక్షుడు, ప్రముఖ కవి యాకూబ్, ఉపాధ్యక్షుడు బాల్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్, పేర్ల రాములు సమన్వయకర్తలుగా వ్యవహరించారు. రెండు సెషన్లుగా సాగిన ఈ సమ్మేళనంలో సుమారు 30 మంది కవులు పాల్గొని సమకాలీన అంశాలపై తమ కలాన్ని వినిపించారు. హృదయాలను తాకిన కవితలు సమ్మేళనంలో ఒక్కో కవిత ఒక్కో అనుభూతిని పంచింది. 'మా నాన్న ప్రవహించే.. దుఃఖ నది' శీర్షికతో సాగిన కవిత అందరినీ ఆలోచింపజేయగా.. 'దక్షిణ భారతదేశానికి బర్రె ఆవుతో సమానం' అంటూ ద్రవిడ దేశంలో బర్రె ప్రాముఖ్యతను చాటిన కవిత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేబుల్ టీవీ స...