భారత్ నేతృత్వంలో ఏఐ-ఆధారిత ఆవిష్కరణలతో గ్లోబల్ క్రియేటివ్ ఎకానమీ : సంజయ్ జాజు
భారత్ నేతృత్వంలో ఏఐ-ఆధారిత ఆవిష్కరణలతో గ్లోబల్ క్రియేటివ్ ఎకానమీ : సమాచార-ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజు దేశవ్యాప్తంగా ప్రతి భాషలో ప్రతి ఒక్కరికీ సమగ్ర సమాచారాన్నిఅందించడానికి భాషాపరమైన అంతరాలను తగ్గించే ఏఐ-ఆధారిత పరిష్కారాలను అమలు చేసే దిశగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా ఏఐ/ఎమ్ఎల్-ఆధారిత సాంకేతిక పరిష్కారాల కోసం కృషిచేస్తున్న ఇంక్యుబేటర్లు, అంకుర సంస్థలతో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు ఈరోజు హైదరాబాద్‌లోని టి-హబ్ లో ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో టి-హబ్ సీఈఓతో పాటు, టి-హబ్‌లో వివిధ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్న అంకుర సంస్థలు, ఐఐటీ హైదరాబాద్, ఎన్‌ఐటీల ఎక్సలెన్స్ సెంటర్ల ప్రతినిధులు, ఇంజినీరింగ్ విద్యాసంస్థలలో క్రియాశీల ఆవిష్కరణ విభాగాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాజు మాట్లాడుతూ.. దేశంలోని క్రియేటివ్ ఎకానమీని ప్రోత్సహించాలనే గౌరవ ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వేవెక్స్ స్టార్టప్ యాక్సిలరేటర్ వేదికను ఏర్పాటు చేసిందన్నారు. భవిష్యత్తుకు సన్నద...