Posts

Showing posts with the label etela rajendar

కంటోన్మెంట్ అభివృద్ధికి కేంద్రం భారీ నిధుల విడుదల – ఈటల రాజేందర్

Image
  కంటోన్మెంట్ అభివృద్ధికి కేంద్రం భారీ నిధుల విడుదల – ఈటల రాజేందర్ హైదరాబాద్, కంటోన్మెంట్: కేంద్ర రక్షణ శాఖ కంటోన్మెంట్ అభివృద్ధికి భారీ నిధులను విడుదల చేసినట్లు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వెల్లడించారు. మంగళవారం కంటోన్మెంట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024లో జూబ్లీ బస్ స్టేషన్‌ నుంచి శామీర్‌పేట వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కోసం అవసరమైన రక్షణ శాఖ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించిన సంగతి తెలిసిందే. భూమి బదిలీకి బదులుగా కేంద్ర రక్షణ శాఖకు జమ చేయాల్సిన రూ.303 కోట్లను కంటోన్మెంట్ బోర్డుకే మళ్లించాలని బోర్డు తీర్మానం చేసినట్లు ఈటల పేర్కొన్నారు. ఈ మేరకు తాను, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖలు రాసినట్టు తెలిపారు. పార్లమెంట్‌లో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించినట్టు తెలిపారు. ఈ లేఖలు, బోర్డు తీర్మానాన్ని పరిగణలోకి తీసుకున్న కేంద్ర రక్షణ శాఖ తాజాగా రూ.303 కోట్లను కంటోన్మెంట్ బోర్డు ఖాతాలోకి నేరుగా జమచేసినట్లు ఉత్తర్వులు జారీ చేసినట్టు ఈటల తెలిపారు. అదనంగా రూ.11 కోట్ల గ్రాంట్‌ను కూడా విడుదల చేసినట్టు పేర్కొన్నారు. వర్షపు నీరు, డ్రైనేజ్ కు భారీ ప్రాజెక్టులు ఈ నిధు...