అంటువ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి: కమీషనర్ ఆర్.వి.కర్ణన్ హైదరాబాద్, జూలై 04(TOOFAN): అంటువ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమీషనర్ ఆర్.వి.కర్ణన్ అన్నారు. శుక్రవారం గ్రేటర్ లో సీజనల్ వ్యాధులు, వెక్టార్ బోర్న్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో మెడికల్ అండ్ హెల్త్, అనుబంధ శాఖల అధికారులతో కమీషనర్ ఒక్కరోజు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్లు అనురాగ్ జయంతి, అపూర్వ చౌహాన్, హేమంత్ సహదేవ్ రావు, అడిషనల్ కమిషనర్లు రఘు ప్రసాద్, సుభద్ర, చీఫ్ మెడికల్ హెల్త్ అధికారి డాక్టర్ పద్మజ, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు డాక్టర్ వెంకన్న, డాక్టర్ ఉమా, ఉస్మానియా యూనివర్సిటీ నుండి ప్రొఫెసర్ జె వెంకటేశ్వరరావు, ఐ ఐ సి టి సైంటిస్ట్ కె.లక్ష్మీ నారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి కర్ణన్ మాట్లాడుతూ... జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులు, వెక్టార్ బోర్న్ వ్యాధుల ...