వికసిత భారత్ లక్ష్యంగా మోదీ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు: మాజీ మంత్రి సి. కృష్ణయాదవ్


పేదల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మాజీ మంత్రి, భాజపా సీనియర్ నేత సి. కృష్ణయాదవ్ తెలిపారు.

శనివారం రాత్రి బాగ్ అంబర్‌పేట్ డివిజన్‌లోని రెడ్ బిల్డింగ్ చౌరస్తాలో నిర్వహించిన *'వికసిత భారత్ సంకల్ప సభ'*లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత 11 ఏళ్లలో మోదీ సర్కార్ చేపట్టిన పాలన దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో నడిపిందని ఆయన అన్నారు. దేశ భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూనే, సామాజిక న్యాయం అందేలా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు కేంద్రం కృషి చేస్తోందన్నారు.

కేంద్ర పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అడపా చంద్రమౌళి, నాయకులు నాగరాజు చారి, కృష్ణగౌడ్, అజయ్ కుమార్, రాఘవేంద్ర చారి, అచ్చిని రమేష్, ధనుంజయ్, బాలు తదితరులు పాల్గొన్నారు.




 

Comments

Popular posts from this blog

సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ గా బాధ్యతలను స్వీకరించిన సి.హెచ్. ప్రియాంక

లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి