*మహిళా భద్రతలో హైదరాబాద్ ఆదర్శం - మేయర్ రామ్మోహన్* తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో రాష్ట్రంలో మహిళల భద్రతకు మరింత భరోసా ఏర్పడిందని నగర మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో రాష్ట్ర మహిళా కమీషన్ ఆధ్వర్యంలో మహిళల చట్టాలపై నిర్వహించిన అవగాహన సదస్సుకు మేయర్ రామ్మోహన్ హాజరయ్యారు. కమీషన్ ఛైర్‌పర్సన్ త్రిపురాన వెంకటరత్నం, జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డిలతో పాటు పలువురు మహిళా కార్పొరేటర్లు, మహిళా అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ సమావేశంలో మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటి సారిగా మహిళల భద్రత, ఈవ్‌టీజింగ్, వేదింపుల నివారణకు హైదరాబాద్ నగరంలో షీ-టీమ్‌లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. షీ-టీమ్‌ల ఏర్పాటుతో హైదరాబాద్‌లోని మహిళలో ఆత్మవిశ్వాసం ఏర్పడిందని తెలుపుతూ ఈ షీ-టీమ్‌లను దేశంలోని వివిధ రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయని గుర్తుచేశారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో మహిళల హక్కులు, గౌరవాలను ఏర్పాటు చేయడానికి ప్రత్యేకంగా విభాగం ఏర్పాటు చేయడానికి అంగీకరిస...