ఐటీ కారిడార్‌లో గ్లోబల్ టచ్.. అమెరికా కాన్సులేట్ రోడ్డు ఇకపై 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ'
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీల్లో కార్పొరేట్ దిగ్గజాల పేర్లతో రహదారులు, కూడళ్లు - గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్, విప్రో జంక్షన్.. రతన్ టాటా పేరుతో మౌలిక వసతులు - హైదరాబాద్ అంతర్జాతీయ ఖ్యాతిని పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తూఫాన్, హైదరాబాద్ :- విశ్వనగరం హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిని, గ్లోబల్ గుర్తింపును మరింత పెంపొందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. నగరంలోని ఐటీ కారిడార్ పరిధిలో ఉన్న ప్రముఖ రహదారులు, ప్రధాన కూడళ్లకు ప్రపంచ ప్రసిద్ధ కార్పొరేట్ సంస్థలు, అంతర్జాతీయ ప్రముఖుల పేర్లు పెట్టాలని సంకల్పించింది. ఇందులో భాగంగా గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని అమెరికా రాయబార కార్యాలయం (యూఎస్ కాన్సులేట్) పక్కన ఉన్న ప్రధాన రహదారికి 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ'గా నామకరణం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ నగరం గ్లోబల్ ప్రొఫైల్‌ను ప్రపంచవ్యాప్తంగా చాటడానికి ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెలాఖరులోనే ఈ రహదారిని అధికారికంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా, ఈ నామకరణ నిర...