రామ్‌నగర్‌లో ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’: నివాసంపై జాతీయ జెండా ఆవిష్కరించిన బండారు దత్తాత్రేయ
- త్రివర్ణ పతాకం భారత ఐక్యత, దేశభక్తికి ప్రతీక: మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ - ప్రతి ఇంటా జెండా ఎగురవేసి దేశభక్తి స్ఫూర్తిని చాటాలని పిలుపు హైదరాబాద్ (తూఫాన్ బ్యూరో): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా సాగుతున్న ‘హర్ ఘర్ తిరంగా’ వేడుకలు నగరంలో అత్యంత ఉత్సాహంగా నిర్వహించబడుతున్నాయి. ఇందులో భాగంగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బండారు విజయలక్ష్మితో కలిసి రామ్‌నగర్‌లోని తమ నివాసంపై త్రివర్ణ పతాకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం వారు జెండాకు వందనం సమర్పించి దేశభక్తి చాటుకున్నారు. దేశభక్తి భావనను పెంపొందించే గొప్ప కార్యక్రమం: ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. జాతీయ జెండా భారతదేశ ఐక్యత, సమగ్రత, గౌరవం మరియు దేశభక్తికి సజీవ ప్రతీక అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ తలపెట్టిన ‘హర్ ఘర్ తిరంగా’ పిలుపుతో ప్రతి ఒక్కరిలో జాతీయ భావన, దేశభక్తి మరింతగా బలపడుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ప్రతి పౌరుడు తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి స్వాతంత్ర్య సమరయోధుల అసమాన త్యాగాలను స్మరించుకోవాలని సూచించారు. దేశ ప్రగతిలో ప్ర...