Posts

Showing posts with the label #bjp #Bjptelangana #ramchanderrao #kishanreddy #drklaxman #BJPhyderabadcentraldistrict #executivemeeting

పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలి

Image
- బర్కత్‌పురలో బీజేపీ సెంట్రల్ జిల్లా కార్యవర్గ సమావేశం - హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, ఎంపీ లక్ష్మణ్   తూఫాన్, హైదరాబాద్:- పార్టీ సంస్థాగత బలోపేతమే ధ్యేయంగా ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు నాయకులుకు పిలుపునిచ్చారు. బర్కత్‌పురలోని బీజేపీ నగర కార్యాలయంలో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశం ఆదివారం అత్యంత కీలక వాతావరణంలో జరిగింది. ఈ సమావేశంలో రానున్న రాజకీయ కార్యాచరణ, పార్టీ బలోపేతం, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై నాయకులు, కార్యకర్తలతో విస్తృతంగా చర్చించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ హాజరై నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను గల్లీ స్థాయి వరకు తీసుకెళ్లడంలో కార్యకర్తలు చురుకైన పాత్ర పోషించాలని వారు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ త...