పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలి
- బర్కత్‌పురలో బీజేపీ సెంట్రల్ జిల్లా కార్యవర్గ సమావేశం
- హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, ఎంపీ లక్ష్మణ్
తూఫాన్, హైదరాబాద్:- పార్టీ సంస్థాగత బలోపేతమే ధ్యేయంగా ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు నాయకులుకు పిలుపునిచ్చారు. బర్కత్‌పురలోని బీజేపీ నగర కార్యాలయంలో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశం ఆదివారం అత్యంత కీలక వాతావరణంలో జరిగింది. ఈ సమావేశంలో రానున్న రాజకీయ కార్యాచరణ, పార్టీ బలోపేతం, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై నాయకులు, కార్యకర్తలతో విస్తృతంగా చర్చించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ హాజరై నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను గల్లీ స్థాయి వరకు తీసుకెళ్లడంలో కార్యకర్తలు చురుకైన పాత్ర పోషించాలని వారు స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో బీజేపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గౌతమ్ రావు, మాజీ మంత్రి సి.కృష్ణ యాదవ్, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, తెలంగాణ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు జి.ఆనంద్ గౌడ్, పార్టీ ప్రభారి వీరెల్లి చంద్రశేఖర్, మహిపాల్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు దీపక్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్ కుమార్, సీనియర్ నాయకుడు ఓఎస్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, సెంట్రల్ జిల్లా కమిటీ సభ్యులు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




Comments
Post a Comment