హైదరాబాద్‌లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ ఫోరమ్ సమ్మిట్
- సచివాలయ కార్యాలయాన్ని ప్రారంభించిన బండారు దత్తాత్రేయ తూఫాన్, హైదరాబాద్ :- నగరంలో ఈ నెల 14, 15, 16 తేదీల్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న 'బ్రిక్స్ దేశాల ట్రేడ్ యూనియన్స్ ఫోరమ్ సమ్మిట్' (BRICS Trade Unions Forum Summit) నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని దత్తోపంత్ టెంగ్డే భవన్‌లో ఏర్పాటు చేసిన సమ్మిట్ సచివాలయ కార్యాలయాన్ని శుక్రవారం మాజీ గవర్నర్, మాజీ కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రారంభించారు. భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) జాతీయ అధ్యక్షుడు సుంకరి మల్లేశం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. 14 దేశాల ప్రతినిధులతో సదస్సు హైదరాబాద్‌లోని హోటల్ మారియట్‌లో మూడు రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ సదస్సుకు బ్రెజిల్, రష్యా, చైనా, భారత్, సౌత్ ఆఫ్రికాతో పాటు మొత్తం 14 దేశాల నుంచి దాదాపు 50 మంది విదేశీ ప్రతినిధులు హాజరుకానున్నారు. వీరితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ జాతీయ కార్మిక సంఘాలకు చెందిన 70 మంది ప్రముఖ నేతలు ఈ సమ్మిట్‌లో పాల్గొంటారని బండారు దత్తాత్రేయ వెల్లడించారు. నాలుగు ప్రధానాంశాలపై మేధోమథనం ప్రస్తుత అంతర్జాతీయ...