జాతీయ జెండా ఆవిష్కరించిన మాజీ మంత్రి సీ కృష్ణ యాదవ్
- ప్రధాని మోదీ పిలుపుతో మువ్వన్నెల జెండాను ఎగురవేసిన బిజెపి సీనియర్ నేత - స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఇంటింటా దేశభక్తి స్ఫూర్తి హైదరాబాద్ (తూఫాన్ బ్యూరో): ఆగస్టు 15న రానున్న భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా సాగుతున్న ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నేత, మాజీ మంత్రి సీ కృష్ణ యాదవ్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపులో భాగంగా హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన జాతీయ జెండాను ఘనంగా ఎగురవేశారు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ పతాకానికి వందనం సమర్పించి తమ దేశభక్తిని చాటుకున్నారు. ఇంటింటా త్రివర్ణ శోభ: ఈ సందర్భంగా సీ కృష్ణ యాదవ్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుల అసమాన త్యాగాలను స్మరించుకోవడానికి ప్రధాని మోదీ తలపెట్టిన 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమం ప్రతి పౌరుడిలో జాతీయ భావాన్ని పెంపొందిస్తోందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై మువ్వన్నెల జెండాను ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.