Posts

Showing posts with the label #Bangaribalaraju #Bangaribalarajumovie #Telugumovies2018 #Tollywood

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మనీషా

Image
 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మనీషా హైదరాబాద్, జూన్ 24(TOOFAN) తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు హైదరాబాద్‌లో మరో లంచం కేసును బట్టబయలు చేశారు. అంబర్‌పేటలోని గోల్నాక, నెహ్రూనగర్ వార్డు నంబర్–2 పరిధిలోగల హైదరాబాద్ మునిసిపల్ నికాయ పరిపాలనా సంచాలక (హై.మ.న.పా.సం.) కార్యాలయంలో పని చేస్తున్న సహాయక ఇంజనీరు టి.మనీషా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడింది. వివరాల ప్రకారం, ఫిర్యాదుదారుడికి సంబంధించిన బిల్లులను ప్రాసెస్ చేసి పై అధికారులకు పంపించేందుకు సహకారం అందించాలన్న పేరిట టి.మనీషా ఫిర్యాదుదారుడి నుంచి మొత్తం రూ.15,000 లంచం కోరినట్లు తెలుస్తోంది. ఇందులో ఇప్పటికే రూ.5,000 తీసుకున్న ఆమె, మిగతా రూ.10,000 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆమెను అడ్డగించారు. ఘటనపై సంబంధిత ఆధారాలు సేకరించిన అనంతరం, టి.మనీషాను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు, తదుపరి విచారణ చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ఇతర సంబంధిత వివరాలను పరిశీలిస్తున్నారు.

జూన్ 21న `పంతం` ఆడియో రిలీజ్ - నిర్మాత కె.కె.రాధామోహ‌న్‌

Image
జూన్ 21న `పంతం` ఆడియో రిలీజ్ - నిర్మాత కె.కె.రాధామోహ‌న్‌ టాలీవుడ్ యాక్ష‌న్ స్టార్ గోపీచంద్ హీరోగా శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై కె.కె.,రాధామోహ‌న్ నిర్మిస్తోన్న చిత్రం `పంతం`. గోపీచంద్ 25వ చిత్ర‌మిది.  `బ‌లుపు`, `ప‌వ‌ర్‌`, `జై ల‌వ‌కుశ‌`వంటి చిత్రాల‌కు స్క్రీన్ ప్లే రైట‌ర్‌గా ప‌నిచేసిన కె.చ‌క్ర‌వ‌ర్తి ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఈ చిత్ర యూనిట్ హైద‌రాబాద్‌లో ఆదివారం ఉద‌యం విలేక‌రుల స‌మావేశాన్ని నిర్వ‌హించారు. `పంతం` గురించి నిర్మాత కె.కె.రాధామోహ‌న్ మాట్లాడుతూ ``మా సంస్థ‌లో ఏడో చిత్రం. గోపీచంద్‌గారు న‌టిస్తోన్న 25వ సినిమా `పంతం`. చాలా ప్రెస్టీజియ‌స్‌గా నిర్మించాం. మేకింగ్ లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. నిర్మాణానంత‌ర ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. జూలై 5న విడుద‌ల చేస్తామ‌ని మేం ఏప్రిల్‌లోనే చెప్పాం. ఆ ప్ర‌కార‌మే ప్ర‌ణాళిక వేసుకుని చిత్రీక‌రిస్తున్నాం. ఇటీవ‌ల యు.కె.,లండ‌న్‌, స్కాట్లండ్ లో కీల‌క స‌న్నివేశాల‌ను, పాట‌ల‌ను చిత్రీక‌రించాం. ఈ నెల 21న విజ‌య‌వాడ‌లో ఆడియో, 24న వైజాగ్‌లో ఫంక్ష‌న్ చేస్తాం. ప్ర‌మోష‌న్స్ విష‌యంలో చాలా కేర్ తీసుకుంటున్నాం. మంచి ఆర్...