నాడొక మురికి కుంట‌...నేడు అది అంద‌మైన ఉద్యాన‌వ‌నం


*నాడొక మురికి కుంట‌...నేడు అది అంద‌మైన ఉద్యాన‌వ‌నం*
*రూ. 6.20కోట్ల‌తో కిష‌న్‌బాగ్ పార్కు నిర్మాణం*
*ప్రారంభించ‌నున్న మంత్రి కె.టి.ఆర్‌*

   నాడు అదో మురికి కుంట‌...నిత్యం దుర్గందం, పిచ్చి మొక్క‌ల‌తో పందులు, ఇత‌ర జంతువుల‌తో ఉన్న ప్రాంతం...నాలుగు ఎక‌రాల విస్తీర్ణంలో ఉన్న ఈ కిష‌న్‌బాగ్‌ కుంట‌ను గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిపల్ కార్పొరేష‌న్ నేడు అంద‌మైన పార్కుగా రూపొందించింది. హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలో మ‌రిన్ని పార్కులు ఏర్పాటు చేయ‌డం ద్వారా గ్రీన‌రిని పెంచేందుకు చేప‌ట్టిన ప్ర‌త్యేక చ‌ర్య‌లో భాగంగా ఖాళీగా ఉన్న స్థ‌లాల్లో పార్కుల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ ప్రాధాన్య‌త‌ను ఇస్తోంది. దీనిలో భాగంగా ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉండి మురుగునీరు, పిచ్చి చెట్ల‌తో నిండి ఉండి ప‌రిస‌ర ప్రాంతాలు దుర్గందం, దుర్వాస‌న‌, దోమ‌ల‌తో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ స‌మ‌స్యకు శాశ్వ‌త ప‌రిష్కారంతో పాటు పాత‌బ‌స్తీ వాసుల‌కు సుంద‌ర‌మైన ఉద్యాన‌వ‌నాన్ని నిర్మించాల‌ని జీహెచ్ఎంసీ నిర్ణ‌యించింది. ఇందుకుగాను రూ. 6.20 కోట్ల‌ను మంజూరు చేసింది. దీంతో రూ. 5.45 కోట్ల‌తో సివిల్ ప‌నులు, రూ. 35 ల‌క్ష‌ల‌తో గ్రీన‌రి, మొక్క‌లు నాట‌డం, రూ. 40 ల‌క్ష‌ల‌తో ఆక‌ర్ష‌నీయ‌మైన లైటింగ్‌ను ఏర్పాటు చేసేందుకు అనుమ‌తించారు. ఈ నిధుల‌తో కిష‌న్‌బాగ్ కుంట మొత్తం నాలుగు ఎకరాల స్థ‌లం చుట్టూ ప్ర‌హ‌రీగోడను నిర్మించ‌డంతో పాటు ఈ గోడ‌పై ఆక‌ర్ష‌నీయమైన ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేశారు. వ‌ర్ష‌పునీరు సులువుగా వెళ్ల‌డానికి వీలుగా స్టార్మ్ వాట‌ర్ డ్రెయిన్ నిర్మించారు. ఈ కుంట‌లో అంత‌ర్గ‌తంగా పార్కును అభివృద్దిచేసి న‌డ‌క‌దారుల‌ను నిర్మించారు. అంత‌ర్గ‌త‌, బ‌హిర్గ‌తంగా పాత్‌-వేల‌ను నిర్మించారు. కూర్చునేందుకు వీలుగా సీటింగ్ కెఫెటేరియా, టాయిలెట్ల నిర్మాణం, మంచినీటి వ‌స‌తి త‌దిత‌ర సౌక‌ర్యాలు క‌ల్పించారు. ప్ర‌ధానంగా ఈ కిష‌న్‌బాగ్ పార్కు ప్ర‌వేశ ద్వారం చూప‌ర్ల‌ను ఆక‌ట్టుకునేవిధంగా నిర్మించారు. అదేవిధంగా పార్కులో ప్ర‌త్యేకంగా ఏర్పాటుచేసిన కుర్చీలు, బ‌ల్లాలలో సంద‌ర్శ‌కులు కూర్చోగానే త్రీవ‌ర్ణ జాతీయ ప‌తాకం వెల‌గేలా ఉండ‌డం ఈ పార్కుకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌న‌గా చెప్పొచ్చు. దీంతో పాటు ఎల్‌.ఇ.డి లైట్ల క‌నువిందుల‌ను కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి మురికి కుంట‌గా ఉన్న కిష‌న్‌బాగ్ కుంట‌ను అంద‌మైన పార్కుగా త‌యారు చేయ‌డం ప‌ట్ల మున్సిప‌ల్ శాఖ మంత్రి కె.టి.రామారావు, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డిల‌కు పాత‌బ‌స్తీవాసులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.
*20న‌ (బుధ‌వారం) మంత్రి కే.టి.ఆర్ చే ప్రారంభం*
మొత్తం రూ. 6.20 కోట్ల వ్య‌యంతో నిర్మించిన కిష‌న్‌బాగ్ పార్కును రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ మంత్రి కె.టి.రామారావు ప్రారంభించ‌నున్నారు. న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, ఉప ముఖ్యమంత్రి మ‌హ్మూద్ అలీ, మంత్రులు నాయిని న‌ర్సింహారెడ్డిల‌తో పాటు హైద‌రాబాద్ పార్ల‌మెంట్ స‌భ్యులు అస‌దుద్దీన్ ఓవైసీ, స్థానిక ఎమ్మెల్యే మ‌హ్మ‌ద్ మోజంఖాన్‌, డిప్యూటి మేయ‌ర్ బాబా ఫ‌సియుద్దీన్‌, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డితో పాటు ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు హాజ‌ర‌వుతారు. 

Comments

Popular posts from this blog

సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ గా బాధ్యతలను స్వీకరించిన సి.హెచ్. ప్రియాంక

లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి