లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి
లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి – బుధేరాలో ఓపెన్ ప్లాట్ నంబరింగ్‌కు రూ.8,000 లంచం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో అవినీతి ఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలానికి చెందిన బుధేరా గ్రామంలో పంచాయతీ కార్యదర్శి పట్లోళ్ల నాగలక్ష్మి లంచం తీసుకుంటూ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. ఓ ఫిర్యాదుదారుడు తనకు చెందిన ఓపెన్ ప్లాట్‌కు కొత్త ఇంటి నంబర్ కేటాయించడంతో పాటు వాటర్ సర్వీసింగ్ షెడ్ ఏర్పాటుకు అనుమతి కోరగా, దీనికి ప్రతిఫలంగా కార్యదర్శి రూ.8,000/- లంచం డిమాండ్ చేసినట్లు వెల్లడైంది. ఫిర్యాదుదారుడు దీనిపై అధికారులను సమాచారమిచ్చాడు. అధికార బృందం పంచాయతీ కార్యాలయంలోనే డబ్బులు తీసుకుంటున్న సమయంలో నాగలక్ష్మిని పట్టుకుంది.
Comments
Post a Comment