మున్సిపల్ పోరులో ‘కమల’ జోష్.. యువ, మహిళా మోర్చా భారీ ర్యాలీ
- ముడుచింతలపల్లిలో జెన్-జీ పాదయాత్ర.. పాల్గొన్న మాజీ మంత్రి కృష్ణ యాదవ్, సామ రంగారెడ్డి
తూఫాన్,హైదరాబాద్ :- మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముడుచింతలపల్లి మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ అపూర్వ రీతిలో దూసుకుపోతోంది. సోమవారం మధ్యాహ్నం యువ మోర్చా, మహిళా మోర్చా సంయుక్త ఆధ్వర్యంలో భారీ ర్యాలీ మరియు ‘జెన్-జీ’ (GEN-Z) పాదయాత్ర నిర్వహించారు. లక్ష్మాపూర్, జగన్‌గూడ మరియు ముడుచింతలపల్లి వార్డుల గుండా సాగిన ఈ ప్రచారంలో మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జి, మాజీ మంత్రి సి. కృష్ణ యాదవ్, మేడ్చల్ జిల్లా ప్రభారి సామ రంగారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో మార్పు యువత మరియు మహిళలతోనే సాధ్యమని ఉద్ఘాటించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం యువతకు కల్పిస్తున్న అవకాశాలను, మహిళా సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, స్థానిక సమస్యల పరిష్కారం కోసం బీజేపీ అభ్యర్థులు నరసింహ గౌడ్, సాయి, ప్రభాకర్‌లను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ముఖ్యంగా యువత మరియు మహిళా శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో వార్డులన్నీ కాషాయమయమయ్యాయి.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బుద్ది శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోనే శ్రీనివాస్, రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు కోమిడి రెడ్డి, బిజెవైఎం ఇన్‌చార్జులు విక్రమ్ సింగ్ ఠాకూర్, సురేందర్ యాదవ్ మరియు భారీ సంఖ్యలో మహిళా నాయకులు, సీనియర్ నేతలు పాల్గొన్నారు.


Comments
Post a Comment