జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తా,అర్హులైన ప్రతి జర్నలిస్టుకు పట్టాలు, లేదా ఇళ్లులు ఇప్పించేందుకు క`షి చేస్తానని హమీ
ప్రెస్ క్లబ్ నూతన కమిటీకి అభినందనలు : ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
హైదరాబాద్, తూఫాన్ ప్రతినిది :- ప్రభుత్వానికి, ప్రజలకి వారధిగా పనిచేసే జర్నలిస్టులు నికార్సైన సమాజ, ప్రజా సేవకులు అని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కోనియాడారు. నాటి నుంచి నేటి వరకు అనేక మంది జర్నలిస్టులు సమాజానికి స్పూర్తీగా నిలిచిన ఘటనలు కొకోల్లలు అని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జర్నలిస్టులనుద్దేశించి మాట్లాడుతూ... జర్నలిస్ట్స్ సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఇళ్ల పట్టాలపై కూడా కలెక్టర్ ద`ష్టికి తీసుకేళ్లి, అర్హులైన ప్రతి సీనీయర్ జర్నలిస్టుకు పట్టాలు, లేదా ఇళ్లులు ఇప్పించేందుకు తన వంతు క`షి చేస్తానని ఆయన హమీ ఇచ్చారు. ముఖ్యంగా ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధిలో పాత్రికేయుల పాత్ర మరువలేనిదని అన్నారు. ప్రతి (నిమిషం) సమస్యపై ప్రజలతో మమేకమై.. వారి సమస్యలను అటు అధికారులు, ఇటు ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకురావడంలో పాత్రికేయుల పాత్ర అభినందనీయమని ఆయన తెలిపారు. నూతనంగా ఎన్నికైన ఉప్పల్ ప్రెస్ క్లబ్ కమిటీకి తన వంతు సహాయక సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.
అంతకుముందు ఇటివల మూడు రోజుల క్రితం నూతనంగా ఏర్పడ్డ ఉప్పల్ ప్రెస్ క్లబ్ కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని ఆదివారంనాడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అధ్యక్షులుగా ఎన్నికైన వేముల తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి గ్యారంపల్లి శివాజీ, వర్కింగ్ ప్రెసిడెంట్ పారేల్లి సాగర్, ఉపాధ్యక్షులు ఏవి శ్రీధర్ రావు, కూకుట్ల నరోత్తం రెడ్డి, కోశాధికారి గుత్తి శేఖర్, జాయింట్ సెక్రటరీ దాస రాజు, ప్రధాన ముఖ్య సలహదారులు, సీనియర్ జర్నలిస్టులు కోడికంటి శ్రీనివాస్, దొంతుల వెంకట్రామిరెడ్డి, కొలనుపాక చంద్రమౌళి,పల్లా మహేందర్ రెడ్డి, ఎస్. ముత్యంరెడ్డి, కమిటి సభ్యులైన ఓ.రమేష్, రాజులను ఎమ్మెల్యే అభినందించారు.
Comments
Post a Comment