పోతారంలో ‘కమల’ శంఖారావం.. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం
ముడుచింతలపల్లి ప్రచారంలో ఎంపీ ఈటల రాజేందర్, మాజీ మంత్రి కృష్ణ యాదవ్ ధీమా
తూఫాన్,హైదరాబాద్ :- మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పోతారం వార్డులో భారతీయ జనతా పార్టీ సమరశంఖం పూరించింది. మున్సిపల్ ఎన్నికల బీజేపీ ఇన్‌ఛార్జి, మాజీ మంత్రి సి. కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రచార కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ నిర్వహించిన ఈ ప్రచార పర్వానికి మహిళా నాయకులు, కార్యకర్తలు రికార్డు స్థాయిలో తరలివచ్చారు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మరియు కృష్ణ యాదవ్ ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను వివరించడంతో పాటు, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని, మున్సిపాలిటీల సర్వతోముఖాభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమని వారు ఉద్ఘాటించారు. వార్డుల్లోని సమస్యల పరిష్కారానికి, పారదర్శక పాలనకు కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ముఖ్యంగా మహిళా లోకం చూపు బీజేపీ వైపే ఉందని, ఈ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ నేతలు ఏనుగు సుదర్శన్ రెడ్డి, జిల్లా ప్రభారి సామ రంగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు బుద్ది శ్రీనివాస్, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్, పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థులు మరియు పెద్ద సంఖ్యలో మహిళా నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




Comments
Post a Comment