సమాజంలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిది

 సామాజిక సేవల్లో సైతం జర్నలిస్టులు ముందుండాలే

ప్రెస్ క్లబ్ కమిటీని అభినందించిన టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ


హైదరాబాద్, తూఫాన్ ప్రతినిధి :- 
నేటి జీవన విధానంలో కాలం మారుతొంది. వింత పోకడలతో వారి జీవన శైలీ మారుతొంది. ఓ వైపు సాంకేతిక పేరుతో పేరుగుతున్న టెక్నాలజీ... మరో వైపు వీటికి తొడు, సమాజంలో కత్తి మీద సాములా తయారైన పేను మార్పులు.. వెరసీ వీటన్నింటిని తట్టుకొని  సమాజంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ కొనియాడారు. సామాజిక రుగ్మతల పరిష్కారం, సేవా కార్యక్రమాలు చేపట్టడంలో జర్నలిస్టులు ముందుండాలని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారంనాడు టీయూడబ్ల్యూజే రాష్ట్ర కోశాధికారి మోతె వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా ఉప్పల్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ సభ్యులు ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనను కలిసిన జర్నలిస్టుల బృందాన్ని విరాహత్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి జర్నలిస్ట్ తమ సంక్షేమ కార్యక్రమాలతో పాటు సామాజిక బాద్యతగా సమాజంలో చోటు చేసుకుంటున్న మార్పులు, మూడ నమ్మకాలు, పలు రుగ్మతులపై వివిధ ప్రజా సంఘాల(ను)తో కలుపుకొని అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు. నాటితో పోల్చుకుంటే? నేటి జర్నలిజంలో నానాటికి పెరిగిపోతున్న పెడ ధోరణులను అరికట్టాలని సూచించారు. ప్రతి జర్నలిస్టు.. తమకు తాముగా జర్నలిజం విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సమస్యల బారీన వర్కింగ్ జర్నలిస్టులతో పాటు, ఆన్యాయానికి గురైన బాధిత జర్నలిస్టులు, డెస్క్ రిపోర్టర్లు, సబ్ ఎడిటర్స్, అక్రిడిటేషన్స్ సమస్యలు,  హక్కుల సాధనకై వారి పక్షాన ఉద్యమించిన చరిత్ర టీయూడబ్ల్యూజేది అని ఆయన పేర్కోన్నారు. ఎప్పుడైన జర్నలిస్టులకి ఈ యూనియన్ అండగా ఉంటుందని, గతంలో కూడా వారి పక్షాన పోరాటం చేసి అదుకున్నదని విరాహత్ అలీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దొంతుల వెంకట్రామిరెడ్డి, ఉప్పల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల తిరుపతిరెడ్డి, , ప్రధాన ముఖ్య సలహాదారులు కోడికంటి శ్రీనివాస్, కొలనుపాక చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి గ్యారంపల్లి శివాజీ, వర్కింగ్ ప్రెసిడెంట్ పారేల్లి సాగర్, ఉపాధ్యక్షులు ఏవి శ్రీధర్ రావు, కూకుట్ల నరోత్తంరెడ్డి, కోశాధికారి గుత్తి శేఖర్, జాయింట్ సెక్రటరీ దాస రాజు తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు. 

Comments

Popular posts from this blog

జేఎన్‌జే జర్నలిస్ట్స్ భూములపై కుట్ర‌లా?

పుస్తకం.. అజ్ఞానపు చీకట్లను చీల్చే దారిదీపం....

యాదగిరిగుట్టలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు!