బ్రహ్మర్షి గురుదేవుల ఆశీస్సులు తీసుకున్న బండారు దత్తాత్రేయ

బాగ్లింగంపల్లిలో ‘దివ్యోహం’ మహోత్సవం.. ఆధ్యాత్మిక సంగమంలో మాజీ గవర్నర్


తూఫాన్,హైదరాబాద్ :-  నగరంలోని బాగ్లింగంపల్లి ఆర్టీసీ కల్యాణ మండపంలో శనివారం నిర్వహించిన ‘దివ్యోహం’ దివ్య సిద్ధేశ్వర్ మహోత్సవం - 2026 ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. ఈ విశేష కార్యక్రమానికి హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. ఈ సందర్భంగా సిద్ధగురువార్ సిద్ధేశ్వర్ బ్రహ్మర్షి గురుదేవులను దర్శించుకున్న దత్తాత్రేయ, వారి నుంచి దివ్య ఆశీస్సులు అందుకున్నారు.

అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ.. లోక కల్యాణం కోసం గురుదేవులు నిర్వహిస్తున్న ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతిని, సోదరభావాన్ని పెంపొందిస్తాయని కొనియాడారు. బ్రహ్మర్షి గురుదేవుల ప్రవచనాలు భక్తుల్లో కొత్త చైతన్యాన్ని నింపుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని గురుదేవుల అనుగ్రహం పొందారు. ఆధ్యాత్మిక వేడుకలతో బాగ్లింగంపల్లి పరిసర ప్రాంతాలు భక్తి పారవశ్యంలో మునిగిపోయాయి.





Comments

Popular posts from this blog

జేఎన్‌జే జర్నలిస్ట్స్ భూములపై కుట్ర‌లా?

పుస్తకం.. అజ్ఞానపు చీకట్లను చీల్చే దారిదీపం....

యాదగిరిగుట్టలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు!