మున్సిపల్ పోరు: పోలింగ్ మేనేజ్‌మెంట్‌పై బీజేపీ ఫోకస్

వార్డు ఇన్‌చార్జులకు రాజ్యసభ ఎంపీ రేఖా శర్మ, మాజీ మంత్రి కృష్ణ యాదవ్ దిశానిర్దేశం


తూఫాన్,హైదరాబాద్ :- మున్సిపల్ ఎన్నికల వేళ క్షేత్రస్థాయిలో ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ తన వ్యూహాలకు పదును పెట్టింది. శుక్రవారం ముడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డుల ఇన్‌చార్జులతో రాజ్యసభ ఎంపీ రేఖా శర్మ, ముడుచింతలపల్లి మున్సిపాలిటీ బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జి, మాజీ మంత్రి సి. కృష్ణ యాదవ్ కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలింగ్ రోజున అనుసరించాల్సిన మేనేజ్‌మెంట్ వ్యూహాలు, ఓటర్ల అనుసంధానం మరియు బూత్ స్థాయి పర్యవేక్షణపై నాయకులకు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా రేఖా శర్మ మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, పోలింగ్ రోజున ప్రతి ఓటు బీజేపీకి పడేలా వార్డు ఇన్‌చార్జులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాజీ మంత్రి కృష్ణ యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూనే, స్థానిక సమస్యల పరిష్కారానికి బీజేపీ సిద్ధంగా ఉందనే నమ్మకాన్ని ఓటర్లలో కలిగించాలని పిలుపునిచ్చారు. 24 వార్డుల్లోనూ పకడ్బందీగా పోలింగ్ నిర్వహణ జరిగేలా సమన్వయంతో ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు.


ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బుద్ది శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోనే శ్రీనివాస్, రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు బోడుసు మాధవి, 24 వార్డుల ఇన్‌చార్జులు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.






 

Comments

Popular posts from this blog

జేఎన్‌జే జర్నలిస్ట్స్ భూములపై కుట్ర‌లా?

పుస్తకం.. అజ్ఞానపు చీకట్లను చీల్చే దారిదీపం....

యాదగిరిగుట్టలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు!