జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో దొడ్డి కొమురయ్యకు ఘన నివాళి
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో దొడ్డి కొమురయ్యకు ఘన నివాళి
హైదరాబాద్, జూలై 04(TOOFAN): తెలంగాణ సాయుధ పోరాటం చరిత్ర వినగానే మొదటగా గుర్తొచ్చేది తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని జీహెచ్ఎంసీ కమీషనర్ ఆర్.వి.కర్ణన్ అన్నారు.
దొడ్డి కొమురయ్య 79వ వర్థంతిని పురస్కరించుకొని శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ... భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి, విముక్తి కోసం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య పోరాటం మరువలేనిది అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమీషనర్ లు అనురాగ్ జయంతి, రఘు ప్రసాద్, గీతా రాధిక, వేణుగోపాల్, సి.ఈ రత్నాకర్, చీఫ్ అకౌంట్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment