వివేకానందుడి బాటలో యువత నడవాలి: కిషన్ రెడ్డి
- బర్కత్‌పుర బీజేపీ నగర కార్యాలయంలో ఘనంగా వివేకానంద జయంతి వేడుకలు
తూఫాన్,హైదరాబాద్ :- స్వామి వివేకానంద ఆశయాలను యువతరం నెరవేర్చాలని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ దేశాభివృద్ధికి పునరంకితం కావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం బర్కత్‌పురలోని నగర బిజెపి కార్యాలయంలో స్వామి వివేకానంద జయంతి మరియు జాతీయ యువజన దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానందుడి చిత్రపటానికి కిషన్ రెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతిని, సనాతన ధర్మ గొప్పతనాన్ని ప్రపంచ నలుమూలల చాటిచెప్పిన మహనీయుడు వివేకానందుడని కొనియాడారు. ఆయన బోధనలు నేటి యువతకు దిక్సూచి వంటివని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ గౌతమ్ రావు, మాజీ మంత్రి సి కృష్ణ యాదవ్, రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షుడు జి.ఆనంద్ గౌడ్, కార్పొరేటర్ కన్నె ఉమా రమేష్ యాదవ్ పాల్గొన్నారు. వీరితో పాటు ఎక్కల నందు, శ్యామ్ రాజ్, ఎక్కల కన్నా, సూర్య ప్రకాష్ సింగ్, చిటి శ్రీదర్, వనం రమేష్, సి వినోద్ యాదవ్, రవీందర్ ఆనంద్ దాస్, పి.గోవర్ధన్ రెడ్డి, పుట్ట పాండు రంగయ్య తదితరులు పాల్గొని నివాళులర్పించారు.



Comments
Post a Comment