విధుల్లో రాణించాలంటే వృత్తి నైపుణ్యం సాధించాలి

 విధుల్లో రాణించాలంటే వృత్తి నైపుణ్యం సాధించాలి

-వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, IPS.


పోలీస్‌ అధికారులు అప్పగించిన పనుల్లో రాణించాలంటే వృత్తిలో నైపుణ్యం సాధించాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అధికారులకు తెలిపారు. యూనిట్ స్థాయి పోలీస్‌ డ్యూటీ మీట్‌ పోటీలను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ గురువారం ప్రారంభించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ రేట్ పరిధిలో వరంగల్‌ కమిషనరేట్‌ చెందిన సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ జోన్లతో పాటు ఇతర పోలీస్ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గోంటున్న డ్యూటీ మీట్‌ పోటీలను వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయములో రెండు రోజుల పాటు నిర్వహించబడుతాయి.  ఈ డ్యూటీ మీట్‌ లో పోలీస్‌ అధికారులు నిరంతరం నిర్వహించే విధులకు సంబంధించి అధికారులు, సిబ్బందికి డ్యూటీ మీట్‌ ద్వారా తమ ప్రతిభ కనబర్చడం జరుగుతుంది. 

ఇందులో భాగంగా కంప్యూటర్‌, ఫోరెన్సిక్‌ సైన్స్‌, ఫింగర్‌ ప్రింట్స్‌, హ్యాండ్లింగ్‌, ప్యాకింగ్‌ లిఫ్టింగ్‌, బాంబ్‌  డిస్పోజల్‌, డాగ్‌ స్క్వాడ్‌, ఫోటో మరియు వీడియో గ్రఫీ విభాగాల్లో పోటీలను నిర్విహించబడుతాయి. ఈ పోటీల్లో విభాగాల వారిగా రాణించిన వారిని జోనల్ స్థాయిలో నిర్వహించబడే పోలీస్ డ్యూటీ మీట్ ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ ఏడాది రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ పోటీలకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో నిర్వహింబడుతుంది.

ఈ పోటీలను ప్రారంభించిన పోలీస్‌ కమిషనర్‌ మాట్లాతుడుతూ పోలీస్‌ అధికారులు వృత్తినైపుణ్యం సాధించడం ద్వారా, నేరస్థులను త్వరితగతిన గుర్తించడంతో పాటు, ప్రజలకు సత్వరమే న్యాయం అందించగలమని పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. ఈ కార్యక్రమములో డీసీపీలు షేక్ సలీమా, అంకిత్ కుమార్, రాజమహేంద్ర నాయక్ అదనపు డిసిపి రవి, సురేష్ కుమార్, ప్రభాకర్ రావు, బోనాల కిషన్ తో పాటు, జోనల్‌కు చెందిన ఏసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు, ఆర్‌.ఐలతో పాటు ఇతర పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ గా బాధ్యతలను స్వీకరించిన సి.హెచ్. ప్రియాంక

లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి