ప్రజావాణి సమస్యల పరిష్కారంలో జాప్యం చేయరాదు: కమిషనర్ ఆర్.వి.కర్ణన్
ప్రజావాణి సమస్యల పరిష్కారంలో జాప్యం చేయరాదు: కమిషనర్ ఆర్.వి.కర్ణన్
హైదరాబాద్, జూన్ 16(TOOFAN): ప్రజావాణి సందర్భంగా ప్రజల నుండి వచ్చిన విన్నపాల పరిష్కారంలో జాప్యం చేయరాదని జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి కర్ణన్ అధికారులను ఆదేశించారు. జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణిలో నగరం నలువైపుల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కమిషనర్ కు విన్నవించారు. ప్రజలు విన్నవించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ...
గ్రేటర్ వ్యాప్తంగా తమ సమస్యలను తెలియజేయడానికి, విన్నపం అందజేసిన నేపథ్యంలో అధికారులు కూడా వారి విన్నవించిన సమస్యను బాధ్యత తో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలు పరిష్కారంలో సంబంధిత హెచ్ఓడి లు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 74 విన్నపాలు రాగా, అందులో టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి 35, ట్యాక్స్ సెక్షన్ 7, ఇంజనీరింగ్, శానిటేషన్ విభాగాలకు 5 చొప్పున, ఎలక్ట్రికల్ విభాగం 4, యు.బి.డి విభాగం 3, హెల్త్, అడ్మినిస్ట్రేషన్, ట్రాన్స్ పోర్ట్ విభాగాలకు రెండు చొప్పున, ఎ.సి రెవెన్యూ, లేక్స్, యు.సి.డి, ప్రాజెక్ట్స్, హెచ్.ఎం.డబ్ల్యూ.ఎస్.ఎస్.బి, ఎ.సి లీగల్ చార్మినార్ జోన్ ఒక్కొక్కటి చొప్పున ఫిర్యాదులు అందగా, ఫోన్ ఇన్ ద్వారా 2 ఫిర్యాదులు అందాయి. జిహెచ్ఎంసి పరిధిలోని ఆరు జోన్లలో మొత్తం 91 అర్జీలు వచ్చాయి. అందులో కూకట్ పల్లి జోన్ లో 47, శేరిలింగంపల్లి జోన్ లో 18, సికింద్రాబాద్ జోన్ లో 14, ఎల్బీనగర్ జోన్ లో 7, చార్మినార్ జోన్ లో 4, ఖైరతాబాద్ జోన్ లో ఒక ఆర్జీ అందింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ లు రఘు ప్రసాద్, వేణుగోపాల్, యాదగిరి రావు, సత్యనారాయణ, వేణుగోపాల్ రెడ్డి, నళినీ పద్మావతి, గీతా రాధిక, మంగతాయారు, సి.ఇ రత్నాకర్, విజిలెన్స్ అడిషనల్ ఎస్ పి శ్రీనివాస్, టౌన్ ప్లానింగ్ సి సి పి శ్రీనివాస్, ఆడిషనల్ సి సి పి లు వెంకన్న, గంగాధర్, ప్రదీప్, చీఫ్ మెడికల్ అధికారి డాక్టర్ పద్మజ, యు బి డి డైరెక్టర్ వెంకటేశ్వర్లు, డిప్యూటీ సి ఈ పనస రెడ్డి, హౌసింగ్ ఈ ఈ లు పి.వి రవీందర్, రాజేశ్వర రావు, అడ్వర్టైజ్మెంట్ ఆఫీసర్, ఫుడ్ సేఫ్టీ అధికారి ముత్యం రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment