గ్రేటర్ వ్యాప్తంగా 1,166 కాలనీలలో ప్రత్యేక సానిటేషన్ డ్రైవ్ పూర్తి* GHMC Sanitation Drive
గ్రేటర్ వ్యాప్తంగా 1,166 కాలనీలలో ప్ రత్యేక సానిటేషన్ డ్రైవ్ పూర్తి*
1892 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు, 655.4 మెట్రిక్ టన్నుల భవన నిర్మాణ వ్యర్థాలు తొలగింపు
హైదరాబాద్, అక్టోబర్ 10, (Toofan):
జీహెచ్ఎంసీ పరిధిలో దీర్ఘకాలికంగా పేరుకుపోయిన తొలగింపు కోసం ప్రత్యేక శుభ్రత డ్రైవ్ ప్రభావవంతంగా కొనసాగుతోంది. సానిటేషన్ డ్రైవ్ చేపట్టి నేటితో ఐదు రోజులు పూర్తి కాగా ఈ డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకూ 150 డివిజన్ ల పరిధిలోనీ 1,166 కాలనీలలో 1892 మెట్రిక్ టన్నుల మున్సిపల్ వ్యర్థాలు, 655 మెట్రిక్ టన్నుల భవన నిర్మాణ వ్యర్థాలు తొలగించడం జరిగింది.
జీహెచ్ఎంసీ పరిధిలోని ఎల్.బి.నగర్, చార్మినార్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, సికింద్రాబాద్ జోన్లలో వ్యర్థాల సేకరణ సజావుగా జరుగుతోంది. అన్ని సర్కిల్స్‌లో వాహనాల మోహరింపు, వ్యర్థాల సేకరణ, డంపింగ్ ప్రాసెస్‌పై అధికారులు పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు.
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ మాట్లాడుతూ, నగరంలోని పాత వ్యర్థాల తొలగింపుతో పాటు శుభ్రమైన, ఆరోగ్యవంతమైన హైదరాబాద్ నిర్మాణం కు జీహెచ్ఎంసీ యంత్రాంగం, సిబ్బంది కృషి చేస్తుందన్నారు. డ్రైవ్ కు ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
.jpeg)
Comments
Post a Comment