*ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా బస్తీ దవాఖానాలు*
*ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా బస్తీ దవాఖానాలు*
నిరుపేదలకు అందిస్తున్న వైద్య పరిక్షలకు గాను గ్రేటర్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలు వైద్య సహయానికి వచ్చేవారితో కిటకిటలాడుతున్నాయి. ఇప్పటి వరకు ఏర్పాటుచేసిన 18 బస్తీ దవాఖానాల్లో ప్రతిరోజు వందలాది మంది వైద్య చికిత్సలకై వస్తున్నారు. ప్రధానంగా బి.జె.ఆర్‌నగర్, గుడ్డీబౌలి, హషీమాబాద్ బస్తీ దవాఖానాలకు ప్రతిరోజు 200లకు పైగా తగు వైద్య పరీక్షలకు హాజరవుతున్నారంటే బస్తీ దవాఖానాల పట్ల బస్తీవాసులు కల్పిస్తున్న ఆదరణకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రత 5 నుండి 10వేల మంది జనాభాకు ఒక బస్తీ దవాఖానాను ఏర్పాటు చేయాలని నగర మేయర్ బొంతు రామ్మోహన్ నిర్ణయించిన సంగతి విదితమే. న్యూఢిల్లీలో విజయవంతంగా నడుస్తున్న మెహల్లాక్లీనిక్‌ల పనితీరును కూడా మేయర్ రామ్మోహన్ ఆధ్వర్యంలో అధికారుల బృందం గతంలో పరిశీలించింది. ఢిల్లీలోని మెహల్లా క్లీనిక్‌ల మాదిరిగానే నగరంలో తొలిదశలో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. దీనిలో భాగంగా 2018 ఏప్రిల్ 6వ తేదీన మల్కాజ్‌గిరి బి.జె.ఆర్ నగర్‌లో 17 బస్తీ దవాఖానాలను రాష్ట్ర మున్సిపల్ శాఖ మత్రి కె.టి.రామారావు, వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిలు లాంఛనంగా ప్రారంభించారు.
*బస్తీ దవాఖానాలో అందే వైద్య సేవలు*
బస్తీలలో నివసించే వారికి తమ వద్దే వైద్యం అందుబాటులో ఉండేలా ఉద్దేశించిన బస్తీ దవాఖానాలో ఓ.పి.సేవలు, కనీస వైద్య పరీక్షలు, కావాల్సిన మందులు అందించే ఫార్మసి, స్వల్పకాల అనారోగ్యం కలిగే వారికి తక్షణ వైద్య చికిత్సలు, టీకాలు తదితర ఇమ్యానైజేషన్ సర్వీసులు, కుటుంబ నియంత్రణ, వైద్య పరమైన కౌన్సిలింగ్, బిపి, బ్లడ్, షుగర్ తదితర పరిక్షలు ఈ బస్తీ దవాఖానాలో అందించడానికి ఏర్పాట్లు చేశారు.
*ప్రతి స్లమ్‌లో ఒక బస్తీ దవాఖానా*
గ్రేటర్ హైదరాబాద్‌లో 1,451 మురికి వాడలుండగా వీటిలో 986 నోటిఫైడ్, 465 నాన్ నోటిఫైడ్ స్లమ్‌లున్నాయి. నగరంలో ఇప్పటికే 112 అర్బన్ హెల్త్ కేంద్రాలు పనిచేస్తుండగా వీటిలో 98 యు.హెచ్.సిలు ప్రభుత్వ భవనాల్లో పనిచేస్తున్నాయి. వీటికి అదనంగా తమ ఆరోగ్య పరిస్థితుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహించే మురికి వాడల్లోనే ఈ బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో జీహెచ్ఎంసీకి చెందిన ఖాళీగా ఉన్న నిరుపయోగంగా ఉన్న కమ్యునిటీ హాళ్లలో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయడానికి అంగీకరించారు. ఇప్పటి వరకు 17 బస్తీ దవాఖానాలు విజయవంతంగా నడుస్తున్నాయి.
*ప్రస్తుతం నడుస్తున్న బస్తీ దవాఖానాలు*
Comments
Post a Comment