కొండాపూర్‌లో రూ. 700ల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

 కొండాపూర్‌లో రూ. 700ల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా.
- 4 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌.


రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం కొండాపూర్‌లో బ‌డాబాబుల ఆగ‌డాల‌కు హైడ్రా చెక్ పెట్టింది. పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌కు బై నంబ‌ర్లు వేసి కొట్టేయాల‌ని చేసే ప్ర‌య‌త్నాల‌ను హైడ్రా  అడ్డుకుంది. దాదాపు 4 ఎక‌రాల మేర పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాన్ని కాపాడి.. చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. పార్కు స్థ‌లాలుగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు పెట్టింది. ఈ ప్రాంతంలో ఎక‌రం రూ. 200ల కోట్లు వ‌ర‌కూ ధ‌ర ప‌లుకుతోంది. ఇలా కాపాడిన భూమి విలువ దాదాపు 700ల కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని అంచ‌నా.  కొండాపూర్ విలేజ్‌లో  57.20 ఎక‌రాల విస్తీర్ణంలో 627 ప్లాట్ల‌తో శ్రీ వేంక‌టేశ్వ‌ర హెచ్ ఏ ఎల్  కాల‌నీని 1980 ద‌శ‌కంలో ఏర్పాటు చేశారు. Toofan E Paper November 22nd


1.20 ఎక‌రాల చొప్పున 2 పార్కులు, 2 ఎక‌రాల ప‌రిధిలో మ‌రో పార్కుతో పాటు.. 1000 గ‌జాల మేర ప్ర‌జావ‌స‌రాల‌కు స్థ‌లాల‌ను కేటాయించారు. ఇప్ప‌డివే ఆక్ర‌మ‌ణ‌ల‌కు గుర‌య్యాయి. పార్కుల‌ను బైనంబ‌ర్ల ద్వారా ప్లాట్లుగా మార్చేసి అమ్మేశారు.  ఇదే విష‌య‌మై ద‌శాబ్దాలుగా పోరాడుతున్న శ్రీ వేంక‌టేశ్వ‌ర హెచ్ ఏ ఎల్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ ప్ర‌తినిధులు హైడ్రాను ఆశ్ర‌యించారు.  హైడ్రా ప్ర‌జావాణిలో సంబంధిత ప‌త్రాల‌తో ఫిర్యాదు చేశారు.


హైకోర్టు ఆదేశాల‌ ప్ర‌కారం... Toofan E Paper November 22nd


ప్ర‌జావాణి ఫిర్యాదును హైడ్రా అధికారులు క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించారు. పార్కులు ప్లాట్లుగా మారిన‌ట్టు క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించిన హైడ్రా అధికారులు గుర్తించారు. అబ్బినేని అన‌సూయతో పాటు ఇత‌రుల ద‌గ్గ‌ర నుంచి వైబీకే రావు జీపీఏ కుదుర్చుకుని  1980 ద‌శ‌కంలో లే ఔట్ వేశారు. ఆ లే ఔట్ ప్ర‌కారం ప్లాట్లు కొన్న‌వారు ఆయా ప్లాట్ల‌ను, నిర్మించిన భ‌వ‌నాల‌ను ఎల్ ఆర్ ఎస్‌, బీఆర్ ఎస్ ద్వ‌రా రెగ్యుల‌రైజ్ కూడా చేసుకున్నారు. 1.20 ఎక‌రాల మేర ఉండాల్సిన పార్కును 3 భాగాలుగా విడ‌దీసి 11 ప్లాట్లు  చేసి అమ్మేసిన‌ట్టు నిర్ధార‌ణ అయ్యింది. మ‌రో రెండు పార్కుల‌ను కూడా అలాగే బై నంబ‌ర్ల‌తో ప‌లువురికి అమ్మేశారు. ఇక్క‌డ లావాదేవీలు నిర్వ‌హించిన వారికి ఎన్.ఆర్.ఐ. లే ముడిస‌ర‌కుగా మారార‌ని అసోసియేష‌న్ ప్ర‌తినిధులు హైడ్రా అధికారుల‌కు తెలిపారు.  ఇక వీళ్ల ద‌గ్గ‌ర నుంచి సింహా డెవ‌ల‌ప‌ర్స్‌, వాస‌వి నిర్మాణ సంస్థ‌తో పాటు మరో ఇద్ద‌రు ముగ్గురు కొని బౌన్స‌ర్ల‌ను పెట్టి.. పార్కుల‌వైపు వెళ్ల‌డం కాదు క‌దా.. చూడ‌డానికి కూడా అవ‌కాశం లేకుండా చేశార‌ని.. క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించిన హైడ్రా అధికారుల ముందు అక్క‌డ నివాసం ఉన్న వారు వాపోయారు. రెసిడెంట్స్ వెల్ఫేర్ ఆసోసియేష‌న్ ప్ర‌తినిధులు హైకోర్టును కూడా ఆశ్ర‌యించారు.  పార్కుల‌తో పాటు ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను కాపాడాల‌ని హైకోర్టు కూడా సూచించింది. హైడ్రాను ఈ దిశ‌గా మార్గ‌ద‌ర్శ‌నం చేసింది. హైకోర్టు ఆదేశాల మేర‌కు శుక్ర‌వారం పార్కుల చుట్టూ ఫెన్సింగ్ వేసి, బోర్డుల‌ను హైడ్రా ఏర్పాటుచేసింది. దీంతో అక్క‌డి స్థానికులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఫిర్యాదు చేసిన వెంట‌నే హైడ్రా స్పందించి పార్కుల‌ను కాపాడిందంటూ ధ‌న్య‌వాదాలు తెలిపారు. Toofan E Paper November 22nd


Comments

Popular posts from this blog

సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ గా బాధ్యతలను స్వీకరించిన సి.హెచ్. ప్రియాంక

లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి