వేగంగా ధాన్యం కొనుగోలు
వేగంగా ధాన్యం కొనుగోలు
- ఇప్పటివరకు జిల్లాలో 01 లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది
- 70శాతం మంది రైతుల ఖాతాలో డబ్బులు జమ
- కలెక్టర్ రాహుల్ రాజ్
శుక్రవారం రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలోని ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లా లో దాదాపు 500 ధాన్యం కొనుగోలు కేంద్రాలు జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సన్న రకం దొడ్డు రకం ధాన్యాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నామన్నారు. కొనుగోలు సెంటర్లో అన్ని రకాల మౌలిక వసతులను కల్పించడం జరిగిందనీ వివరించారు. తేమ శాతం వచ్చిన వెంటనే కాంటబెట్టి వెంటనే మిల్లులకు తరలించడం జరుగుతుందన్నారు. రవాణాకు సంబంధించిన వాహనాలను అందుబాటులో ఉంచడం జరిగిందనీ, ధాన్యం తరలింపు కోసం 67 రైస్ మిల్లులు ట్యాగింగ్ చేయడం జరిగిందనీ, ఇంకా 20 మిల్లులను ట్యాగింగ్ కొరకు సిద్ధం చేస్తున్నామన్నారు. Toofan E Paper 15th Nov 2025
ఈ రోజు వరకు లక్ష మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందనీ , గత సంవత్సరం ఇదే నెలలో 9060 మంది రైతుల నుంచి 44,718.960 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 4.71 కోట్ల రూపాయలను చెల్లించగా... ప్రస్తుత సీజన్ కి... ఇప్పటివరకు 24,700 మంది రైతుల నుండి 1,03,411.240 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 84.19 కోట్ల చెల్లింపులు జరిగాయన్నారు. ఈసారి అంచనాలకు మించి సుమారు మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసే దిశగా ముందుకు పోతున్నామన్నారు. తులందరూ ఈ అవకాశ సద్వినియోగం చేసుకుని తేమశాతం వచ్చిన వెంటనే ధాన్యాన్ని శుభ్రం చేసి కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చినట్లతే మద్దతు ధర పొందవచ్చని తెలిపారు. డిసెంబర్ కల్లా కొనుగోలు పూర్తిచేసి రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేసే విధంగా పటిష్ట కార్యచరణ ద్వారా ముందుకు పోతున్నామన్నారు. ఈ కొనుగోలు కేంద్రం లో 80 మంది రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా 70 మందికి రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయడం జరిగిందనీ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని వివరించారు. జిల్లావ్యాప్తంగా 70% రైతులకు ధాన్యానికి సంబంధించి వారి ఖాతాలలో డబ్బులు జమ అయినట్లు వివరించారు. ప్రభుత్వం రైతుల పట్ల అత్యంత పారదర్శకంగా గౌరవిస్తుందని సన్న వడ్లకు బోనస్ చెల్లించే విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ సీజన్ కు సంబంధించిన డబ్బులు ఆకౌంట్లో జమవుతుంద ని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. Toofan E Paper 15th Nov 2025

Comments
Post a Comment