హెచ్‌ఎండీఏ జోనింగ్‌తో రైతులకు శాపం
గ్రామాల విలీనం అశాస్త్రీయం.. ప్రభుత్వంపై వత్తిడి తెద్దాం
బౌరంపేట్‌లో రైతులతో సమావేశమైన బండారు దత్తాత్రేయ
తూఫాన్,హైదరాబాద్ :- ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న గ్రామాలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడం అశాస్త్రీయమని, దీనివల్ల గ్రామాల జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ విమర్శించారు. మేడ్చల్ జిల్లా బౌరంపేట్ గ్రామంలో శుక్రవారం పీసరి కృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రైతుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకుని, వారి నుంచి వినతి పత్రాలను స్వీకరించారు.
సామాన్య రైతులకు తీరని నష్టంఅనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ.. హెచ్‌ఎండీఏ పరిధిలోని కన్జర్వేషన్, రిక్రియేషన్ జోన్ల వల్ల సన్న, చిన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రైతులకు శాపంగా మారిందని ధ్వజమెత్తారు. "70 ఏళ్లుగా పేద రైతుల స్వాధీనంలో ఉన్న లావాణి పట్టా భూములను ప్రభుత్వం లాక్కోవడం సరైన పద్ధతి కాదు. ఔటర్ రింగ్ రోడ్డు, సర్వీస్ రోడ్డు నుంచి రైతులు తమ సొంత పొలాల్లోకి వెళ్లే దారిని కూడా అధికారులు అడ్డుకోవడం దారుణం" అని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యమంత్రితో భేటీ.. లేదంటే ఉద్యమంఈ సమస్యలపై త్వరలోనే ముఖ్యమంత్రిని కలిసి స్పష్టమైన పరిష్కారం కోరతానని దత్తాత్రేయ వెల్లడించారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించని పక్షంలో, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలను కలుపుకొని 50 వేల మంది రైతులతో భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతుల హక్కులు సాధించుకుందామని పిలుపునిచ్చారు.
భారీగా తరలివచ్చిన రైతులుఈ కార్యక్రమంలో బౌరంపేట్ మాజీ సర్పంచ్‌లు డాక్టర్ ఎస్. మల్లారెడ్డి, అర్కల వీరేశం గౌడ్, కొమ్ము మంగమ్మ, మాజీ ఎంపీటీసీ ఎస్. జంగారెడ్డి, రైతు నాయకులు కళ్లెం బాల్ రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో రైతులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
తూఫాన్,హైదరాబాద్ :- ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న గ్రామాలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడం అశాస్త్రీయమని, దీనివల్ల గ్రామాల జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ విమర్శించారు. మేడ్చల్ జిల్లా బౌరంపేట్ గ్రామంలో శుక్రవారం పీసరి కృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రైతుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకుని, వారి నుంచి వినతి పత్రాలను స్వీకరించారు.
సామాన్య రైతులకు తీరని నష్టం
అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ.. హెచ్‌ఎండీఏ పరిధిలోని కన్జర్వేషన్, రిక్రియేషన్ జోన్ల వల్ల సన్న, చిన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రైతులకు శాపంగా మారిందని ధ్వజమెత్తారు. "70 ఏళ్లుగా పేద రైతుల స్వాధీనంలో ఉన్న లావాణి పట్టా భూములను ప్రభుత్వం లాక్కోవడం సరైన పద్ధతి కాదు. ఔటర్ రింగ్ రోడ్డు, సర్వీస్ రోడ్డు నుంచి రైతులు తమ సొంత పొలాల్లోకి వెళ్లే దారిని కూడా అధికారులు అడ్డుకోవడం దారుణం" అని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యమంత్రితో భేటీ.. లేదంటే ఉద్యమం
ఈ సమస్యలపై త్వరలోనే ముఖ్యమంత్రిని కలిసి స్పష్టమైన పరిష్కారం కోరతానని దత్తాత్రేయ వెల్లడించారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించని పక్షంలో, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలను కలుపుకొని 50 వేల మంది రైతులతో భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతుల హక్కులు సాధించుకుందామని పిలుపునిచ్చారు.
భారీగా తరలివచ్చిన రైతులు
ఈ కార్యక్రమంలో బౌరంపేట్ మాజీ సర్పంచ్‌లు డాక్టర్ ఎస్. మల్లారెడ్డి, అర్కల వీరేశం గౌడ్, కొమ్ము మంగమ్మ, మాజీ ఎంపీటీసీ ఎస్. జంగారెడ్డి, రైతు నాయకులు కళ్లెం బాల్ రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో రైతులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.



Comments
Post a Comment