పద్మశాలి సంఘం రాజకీయ చైతన్య వేదిక.. ముఖ్య అతిథిగా బండారు దత్తాత్రేయ


తూఫాన్,హైదరాబాద్ :- హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వేదికగా ముషీరాబాద్ నియోజకవర్గ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 'రాజకీయ చైతన్య వేదిక' కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాజకీయంగా పద్మశాలీలు సంఘటితమై తమ హక్కుల సాధనకై పోరాడాలని, చట్టసభల్లో సముచిత స్థానం పొందేలా చైతన్యవంతులు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ ఎం. అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. సామాజిక అభివృద్ధిలో పద్మశాలీల పాత్రను కొనియాడారు. సంఘం అధ్యక్షుడు అతినగరం సుధేష్ నేత అధ్యక్షతన జరిగిన ఈ సభలో బొమ్మెర్ల సతీష్ కుమార్, ఏ. వినయ్ కుమార్, బొట్టు శ్రీనివాస్ నేత తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పద్మశాలీల రాజకీయ భవిష్యత్తు మరియు సంఘం బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.


 

Comments

Popular posts from this blog

జేఎన్‌జే జర్నలిస్ట్స్ భూములపై కుట్ర‌లా?

పుస్తకం.. అజ్ఞానపు చీకట్లను చీల్చే దారిదీపం....

యాదగిరిగుట్టలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు!