లలిత కళా తోరణంలో 'గుడ్‌విల్@40' వేడుకలు

ఘనంగా రిపబ్లిక్ డే సంబరాలు.. హాజరైన బండారు దత్తాత్రేయ



తూఫాన్,హైదరాబాద్ :- హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోని లలిత కళా తోరణం వేదికగా గుడ్‌విల్ స్కూల్స్ 40 ఏళ్ల విద్యా ప్రయాణాన్ని పురస్కరించుకుని 'Goodwill@40' పేరుతో రిపబ్లిక్ డే వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. గత నాలుగు దశాబ్దాల్లో భారతదేశం సాధించిన ప్రగతితో పాటు గుడ్‌విల్ స్కూల్స్ ఎదుగుదలను ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల సంప్రదాయాలు, కళలను ప్రదర్శించడమే కాకుండా.. 'న్యూ ఇండియా' స్ఫూర్తిని చాటుతూ డ్రోన్ టెక్నాలజీ, సౌర శక్తి నైపుణ్యాలు, ఇస్రో శాస్త్రవేత్తల కృషిని విద్యార్థులు సృజనాత్మకంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. దేశ నిర్మాణంలో విలువలతో కూడిన విద్యా సంస్థల పాత్ర కీలకమని, గుడ్‌విల్ స్కూల్స్ నలభై ఏళ్లుగా అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ.. దేశ అభివృద్ధితో పాటు గుడ్‌విల్ సంస్థ కూడా ఎదుగుతూ సమాజానికి నాణ్యమైన విద్యను అందిస్తోందని అన్నారు. యువ నాయకుడు జయసింహ మాట్లాడుతూ.. ఈ వేడుకలు భారతీయ సాంస్కృతిక మూలాలను ఆధునిక సాంకేతికతతో అనుసంధానించాయని, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాయని పేర్కొన్నారు. ఐదో దశాబ్దంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేలా విలువలతో కూడిన విద్యను కొనసాగిస్తామని పాఠశాల యాజమాన్యం స్పష్టం చేసింది.



 

Comments

Popular posts from this blog

జేఎన్‌జే జర్నలిస్ట్స్ భూములపై కుట్ర‌లా?

పుస్తకం.. అజ్ఞానపు చీకట్లను చీల్చే దారిదీపం....

యాదగిరిగుట్టలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు!