వివేకానగర్‌లో గణతంత్ర సంబరాలు
తూఫాన్,హైదరాబాద్ :- చిక్కడపల్లి వివేకానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం జనతా పార్క్ సమీపంలో ఘనంగా జరిగాయి. నూతనంగా ఎన్నికైన అసోసియేషన్ కార్యవర్గ సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమం వైభవంగా నిర్వహించబడింది. అసోసియేషన్ అధ్యక్షుడు వాణీశ్వర శాస్త్రి ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను అనుభవిస్తూనే, పౌరులుగా మన బాధ్యతలను విస్మరించకూడదని పేర్కొన్నారు. కాలనీ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సమన్వయంతో సహకరించాలని ఆయన కోరారు. వేడుకల్లో భాగంగా చిన్నారులకు, స్థానిక కాలనీవాసులకు మిఠాయిలు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు టి. గోపాల్, నర్సింగ్ రావు, జాయింట్ సెక్రటరీ దోనేటి సత్యం పాల్గొన్నారు. అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్. శ్రీనివాస్, చిలుకూరి అఖిలేష్, ఈశ్వర్‌తో పాటు భారీ సంఖ్యలో కాలనీవాసులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు.

Comments
Post a Comment