వివేక్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

తూఫాన్,హైదరాబాద్ :-  వివేక్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం చిక్కడపల్లిలోని జనతా పార్కులో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. సంఘం నూతన అధ్యక్షులుగా ఎన్నికైన సి.హెచ్. వానీశ్వర శాస్త్రి ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.సంఘం ఉపాధ్యక్షులుగా టి. గోపాల్, నర్సింగ్ రావు, కోశాధికారిగా సురేష్ రాజు బాధ్యతలు స్వీకరించారు. అలాగే సంయుక్త కార్యదర్శిగా దోనేటి సత్యం, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా చిలుకూరి అఖిలేష్, ఈశ్వర్ ప్రమాణ స్వీకారం చేశారు. మేనేజింగ్ కమిటీ సభ్యులుగా శ్రీనివాస్, బి.వి. సాయినాథ్, లక్ష్మీ నారాయణలు బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా విచ్చేసిన డాక్టర్ నరేష్ గౌడ్, రాజమోహన్, శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. కొత్త కార్యవర్గం కాలనీ సమస్యల పరిష్కారానికి, ప్రజల సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన బాధ్యులకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.



 

Comments

Popular posts from this blog

జేఎన్‌జే జర్నలిస్ట్స్ భూములపై కుట్ర‌లా?

పుస్తకం.. అజ్ఞానపు చీకట్లను చీల్చే దారిదీపం....

యాదగిరిగుట్టలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు!