ఉత్తమ కాలనీలకు ప్రత్యేక అవార్డులు...ప్రతి నెల 30వ తేదీలోగా దరఖాస్తులకు ఆహ్వానం
*ఉత్తమ కాలనీలకు ప్రత్యేక అవార్డులు...ప్రతి నెల 30వ తేదీలోగా దరఖాస్తులకు ఆహ్వానం*
*ప్రతి సర్కిల్‌కు ఐదు అవార్డులు*
హైదరాబాద్ నగరంలో స్వచ్ఛ కార్యక్రమాల్లో కాలనీ సంక్షేమ సంఘాలను మరింత చురుకుగా భాగస్వామ్యం చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇందుకుగాను స్వచ్ఛ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఆదర్శంగా నిలిచిన కాలనీ సంక్షేమ సంఘాలకు ప్రతినెల ప్రత్యేక పురస్కారాలు అందజేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. కాలనీ సంక్షేమ సంఘాలకు అవార్డులు అందజేసే ప్రక్రియ ఇటీవల నిలిచింది. కాలనీ సంక్షేమ సంఘాలకు తిరిగి అవార్డులు అందజేయాలని, ఇందుకుగాను 11విభాగాలను నిర్థారించి వాటిలో ఆయా కాలనీలు చేపట్టిన చర్యలను తెలుపుతూ ప్రతినెల 30వ తేదీలోగా సంబంధిత డిప్యూటి కమిషనర్లకు అందజేయాలని, ఆర్‌డబ్ల్యూఏలకు కమిషనర్ సూచించారు. ఈ అవార్డుల వివరాలన్నీ జీహెచ్ఎంసీ వెబ్‌సైట్‌లో ఉంచడం జరిగిందని కమిషనర్ పేర్కొన్నారు. ప్రతినెల 5వ తేదీన ఈ అవార్డులను సంబంధిత డిప్యూటి కమిషనర్లు అందజేస్తారని కమిషనర్ ప్రకటించారు. ఒక్కో సర్కిల్‌కు ఐదు కాలనీలను ఉత్తమ గుర్తించి తగు పురస్కారాలను అందజేయనున్నారు. దీనిలో భాగంగా మొత్తం 11విభాగాలను పేర్కొని వాటికి 200మార్కులుగా నిర్ణయించారు.
1. కాలనీల్లో చెత్తను వేరుచేసేందుకు సహకరించడానికి 50మార్కులు
2. ఇళ్లలో లేదా కాలనీలలో సేంద్రియ ఎరువుల తయారీ కంపోస్ట్ పిట్‌ల ఏర్పాటుకు 50మార్కులు
3. జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న పలు అవగాహన, చైతన్య కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొనే ఆర్.డబ్య్లూఏలకు 20 మార్కులు
4. స్థానిక పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తించి తగు విధంగా సత్కరించడం 20మార్కులు
5. హరితహారం నిర్వహణకు 10మార్కులు
6. బహిరంగ మలమూత్ర విసర్జన నివారణకు 20మార్కులు
7. చెత్తను తగలబెట్టకుండా నివారించినందుకు 20మార్కులు
8. బహిరంగ గార్బేజ్ పాయింట్ల తొలగింపుకు 30మార్కులు
9. వీధికుక్కల దత్తత కార్యక్రమం *మా ఇంటి నేస్తం*కు 10మార్కులు
10. యాభై మైక్రాన్ల కన్న ఎక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్ల వినియోగానికి 20మార్కులు
11. వినూత్న స్వచ్ఛ కార్యక్రమాలకు 20మార్కులు
పైన పేర్కొన్న 11అంశాలకు 200మార్కులను సంబంధిత కాలనీ సంక్షేమ సంఘాలు స్వీయ ప్రకటిత దరఖాస్తులను ప్రతి నెల 30వ తేదీలోగా జీహెచ్ఎంసీ eeswmc@gmail.com అనే మెయిల్‌కు పంపించాలి. ఈ దరఖాస్తులను థార్డ్ పార్టీ ద్వారా తనిఖీ చేయించి ప్రతి సర్కిల్‌కు ఐదు కాలనీలకు ఈ అవార్డు అందజేయనున్నట్టు జీహెచ్ఎంసీ కమీషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి తెలిపారు. ప్రతినెల 5వ తేదీన ప్రత్యేకంగా నిర్వహించే కార్యక్రమంలో ఈ అవార్డులను అందజేస్తామని తెలిపారు.

Comments
Post a Comment