*జీహెచ్ఎంసీలో ఎస్.ఎఫ్.ఏలకు రూ. 500 అలవెన్స్ పెంపు*
*జీహెచ్ఎంసీలో ఎస్.ఎఫ్.ఏలకు రూ. 500 అలవెన్స్ పెంపు*
*పారదర్శకంగా ఎస్.ఎఫ్.ఏల అంతర్గత బదిలీలు*
జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న పారిశుధ్య క్షేత్ర సహాయకుల(ఎస్.ఎఫ్.ఏ) అలవెన్స్‌ను రూ. 1000 నుండి రూ. 1,500లకు పెచండంతో పాటు వారిని ఇతర సర్కిళ్లకు బదిలీ చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి నేడు ఉత్తర్వులు జారీచేశారు. హైదరాబాద్ నగరంలో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణలో కీలక పాత్ర వహించే ఎస్.ఎఫ్.ఏలు తమ అలవెన్స్‌ను పెంచాలనే సుదీర్ఘకాలంగా ఉన్న డిమాండ్‌ను పరిగణలోకి తీసుకొని మరో రూ. 500లను పెంచుతున్నట్టు కమిషనర్ ప్రకటించారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో 948 మంది ఎస్.ఎఫ్.ఏలు ఉండగా వీరిలో 936మంది ఔట్‌సోర్సింగ్ పద్దతిన విధులు నిర్వర్తిస్తున్నారు. సుదీర్ఘకాలంగా ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న వీరిని బదిలీచేయాలని కార్పొరేటర్లు, శాసన సభ్యులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు అనేకమార్లు కోరడం జరిగింది. వీరి బదిలీపై జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో కూడా పలుమార్లు ప్రస్థావన వచ్చింది. గతంలో ఎస్.ఎఫ్.ఏల బదిలీలను చేపట్టాలని భావించినా అకాడమిక్ ఇయర్ మధ్యలో చేపట్టవద్దని పలువురు ఎస్.ఎఫ్.ఏలు కమిషనర్‌ను కోరారు. దీంతో ప్రస్తుత విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే చేపట్టాలని నిర్ణయించారు. అయితే ఎస్.ఎఫ్.ఏల బదిలీలను అత్యంత పారదర్శకంగా, ఏవిధమైన రాజకీయ, అధికారిక ఒత్తిళ్లు లేకుండా చేపట్టాలని మేయర్ రామ్మోహన్, కమిషనర్ జనార్థన్‌రెడ్డిలు నిర్ణయించి ఈ బాధ్యతను అడిషనల్ కమిషనర్లు శృతిఓజా, ముషారఫ్ అలీలకు అప్పగించారు. కాగా ఎస్.ఎఫ్.ఏల పూర్తి వివరాలను సేకరించి ఐటి విభాగం ఎస్.ఎఫ్.ఏలను ఒక సర్కిల్ నుండి మరో సర్కిల్‌కు బదిలీ చేయడానికి అత్యంత పారదర్శకవిధానమైన ఆన్‌లైన్ డేటా మేనేజ్‌మెంట్ టోల్ పద్దతిని ఉపయోగించారు. కేవలం ఎన్నికల సందర్భంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు, సిబ్బందిని ర్యాండమైజేషన్ పద్దతిలో పోలింగ్ కేంద్రాలకు ఏవిధంగా కేటాయిస్తారో అదేవిధమైన పద్దతిని ఎస్.ఎఫ్.ఏల బదలీలో చేపట్టారు. ప్రస్తుతం వారు పనిచేస్తున్న ప్రదేశం, సర్కిల్, మేల్, ఫీమేల్ వివరాలను డేటా బేస్ టేబుల్‌గా రూపొందించి ఎస్.ఎఫ్.ఏలను తమ ప్రస్తుత జోన్‌లోని ఇతర సర్కిళ్లకు బదిలీచేసే విధంగా ప్రోగ్రామింగ్ చేపట్టారు. అయితే మహిళా ఎస్.ఎఫ్.ఏలను మాత్రం ఇతర సర్కిళ్లకు కాకుండా ప్రస్తుతం పనిచేస్తున్న సర్కిల్‌లోని ఇతర ప్రదేశాలకు కేటాయిస్తూ ఈ సందర్భంగా నిర్ణయించారు. నేడు ఉదయం డిప్యూటి కమిషనర్లు, ఎస్.ఎఫ్.ఏల సమక్షంలో ర్యాండమైజేషన్ పద్దతిలో బదిలీలను చేపట్టారు. ముందుగా ఎస్.ఎఫ్.ఏలను ఇతర సర్కిళ్లకు బదిలీ చేసి అనంతరం సర్కిళ్లలోని వివిధ ప్రాంతాలను కేటాయించారు. వివిధ సర్కిళ్లకు బదిలీచేసిన ఎస్.ఎఫ్.ఏల జాబితాను జోనల్ కమిషనర్లకు పంపడం జరిగిందని, తమకు కేటాయించిన స్థానాల్లో వెంటనే విధుల్లోకి చేరాలని కమిషనర్ జనార్థన్‌రెడ్డి తెలియజేశారు.
*ఎస్.ఎఫ్.ఏలకు మరో రూ. 500 అదనపు అలవెన్స్*
జీహెచ్ఎంసీలో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య క్షేత్ర సహాయకులకు ప్రస్తుతం అందిస్తున్న రూ. 1000లకు అదనంగా మరో రూ. 500 రూపాయలను పెంచుతున్నట్లు కమిషనర్ జనార్థన్‌రెడ్డి ప్రకటించారు. తమ అలవెన్స్‌ను పెంచాలని ఎస్.ఎఫ్.ఏలు మేయర్, డిప్యూటి మేయర్లకు విజ్ఞాపన పత్రం సమర్పించారు. వీరి విజ్ఞాపనను పరిగణలోకి తీసుకొని రూ. 500 అలవెన్స్‌ను అదనంగా పెంచుతున్నట్టు కమిషనర్ తెలిపారు. ఎస్.ఎఫ్.ఏల బదిలీలను అత్యంత పారదర్శకంగా ఉననతాధికారులు, డిప్యూటి కమిషనర్లు ఎస్.ఎఫ్.ఏల సమక్షంలోనే చేపట్టామని పేర్కొన్నారు. తమకు కేటాయించిన స్థానాల్లో వెంటనే జాయిన్ కావాలని వారికి సూచించారు. మహిళా ఎస్.ఎఫ్.ఏలను ఇతర సర్కిళ్లకు కాకుండా ప్రస్తుతం వారు పనిచేస్తున్న సర్కిల్‌లోనే అంతర్గతంగా బదిలీలు చేశామని వివరించారు.
Comments
Post a Comment