లంచం తీసుకుంటూ పట్టుబడిన ఉప రాష్ట్ర పన్నుల అధికారి

 లంచం తీసుకుంటూ పట్టుబడిన ఉప రాష్ట్ర పన్నుల అధికారి

హైదరాబాద్‌, మాధాపూర్‌: జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ కోసం ఫిర్యాదుదారుడిని నుంచి లంచం తీసుకుంటూ తెలంగాణ రాష్ట్ర అనిశా (ACB) అధికారులకు ఓ ప్రభుత్వ అధికారి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. 


మాధాపూర్‌ ప్రాంతానికి చెందిన ఉప రాష్ట్ర పన్నుల అధికారి ఎం. సుధ ఓ కంపెనీకి జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ చేసి, నంబర్‌ జారీ చేయడానికి సంబంధించి ఫిర్యాదుదారుడిని నుంచి రూ.8,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటూ మంగళవారం సాయంత్రం అడ్డంగా దొరికిపోయారు. వివరాల్లోకి వెళ్తే, లంచం ఇవ్వడం తల్లడిల్లిన బాధితుడు అనిశా అధికారులను ఆశ్రయించాడు. వారి పర్యవేక్షణలో నిర్వహించిన వలలో ఎం. సుధ లంచం తీసుకుంటూ పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని, అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అనిశా అధికారులు వెల్లడించారు.

Comments

Popular posts from this blog

సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ గా బాధ్యతలను స్వీకరించిన సి.హెచ్. ప్రియాంక

లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి