బూత్ స్థాయి నుంచే పార్టీ పటిష్టం.. అంబర్‌పేటలో బీజేపీ శిక్షణ తరగతులు

- పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ ప్రారంభం

- పాల్గొన్న మాజీ మంత్రి సి. కృష్ణ యాదవ్, పార్టీ ముఖ్య నేతలు 


తూఫాన్,హైదరాబాద్ :- అంబర్‌పేట నియోజకవర్గ పరిధిలోని బర్కత్‌పురాలో గల బీజేపీ జిల్లా కార్యాలయంలో సోమవారం 'పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ - 2026' కార్యక్రమం ఘనంగా జరిగింది. నల్లకుంట డివిజన్ పరిధిలోని కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంగా నిర్వహించిన ఈ శిక్షణ తరగతులకు మాజీ మంత్రి సి. కృష్ణ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్తులో చేపట్టబోయే ప్రజా పోరాటాలపై ఈ సందర్భంగా శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో కృష్ణ యాదవ్ మాట్లాడుతూ.. పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని, బూత్ స్థాయిలో పార్టీని పటిష్టం చేసినప్పుడే విజయాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేయాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీకి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాలని నాయకులకు సూచించారు.


ఈ విస్తృత స్థాయి సమావేశంలో శక్తి కేంద్రాల ఇన్చార్జీలు, బూత్ కోఆర్డినేటర్లు, పన్నా ప్రముఖ్‌లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నల్లకుంట డివిజన్ పరిధిలోని ప్రతి బూత్ పరిధిలో ఓటర్లతో నిరంతరం టచ్‌లో ఉండాలని, పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయాలని సీనియర్ నేతలు కార్యకర్తలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నియోజకవర్గ మరియు డివిజన్ స్థాయి ముఖ్య నాయకులు, పన్నా ప్రముఖ్‌లు పాల్గొని రాబోయే రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటించారు.





Comments

Popular posts from this blog

జేఎన్‌జే జర్నలిస్ట్స్ భూములపై కుట్ర‌లా?

పుస్తకం.. అజ్ఞానపు చీకట్లను చీల్చే దారిదీపం....

యాదగిరిగుట్టలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు!