అంబర్‌పేటలో ఘనంగా వీర్ బాల్ దివస్....
సిక్కు గురువుల త్యాగాలను స్మరించుకున్న నేతలు 6 నంబర్ చౌరస్తా నుంచి అలీ కేఫ్ వరకు భారీ ప్రదర్శన
తూఫాన్(హైదరాబాద్):- సిక్కు మత పదో గురువు గురు గోవింద్ సింగ్ కుమారులు జోరావర్ సింగ్, ఫతే సింగ్‌ల వీరోచిత త్యాగాలను స్మరిస్తూ అంబర్‌పేటలో గురువారం రాత్రి 'వీర్ బాల్ దివస్' వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక 6 నంబర్ చౌరస్తా నుండి అలీ కేఫ్ వరకు సాగిన ఈ ప్రదర్శనలో నాయకులు, సిక్కు సామాజిక వర్గ ప్రతినిధులు మషాల్ (కాగడాలు), కొవ్వొత్తులతో భారీ ర్యాలీ చేపట్టారు.
అమరవీరుల స్మరణలో రాజకీయ ప్రముఖులు
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గౌతమ్ రావు, నాయకులు దీపక్ రెడ్డి, మాజీ మంత్రి సి. కృష్ణ యాదవ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిన్న వయసులోనే మతం కోసం, ధర్మ రక్షణ కోసం ప్రాణాలర్పించిన సాహిబ్‌జాదాల త్యాగం వెలకట్టలేనిదని కొనియాడారు. వారి ధైర్య సాహసాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
కదిలివచ్చిన శ్రేణులు.. భక్తిశ్రద్ధలతో ర్యాలీ
సెంట్రల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓఎస్ రెడ్డి, అజయ్ కుమార్, నేతలు కర్ణె రమేష్ యాదవ్, వినోద్ యాదవ్ నాయకత్వంలో సాగిన ఈ ర్యాలీలో స్థానిక కార్పొరేటర్లు అమృత, ఉమా రమేష్ యాదవ్ పాల్గొన్నారు. అలాగే బీజేవైఎం నాయకులు సునీల్, సాయి సందీప్, చుక్క జగన్, అచిని రమేష్, రామ్ రెడ్డి, భాస్కర్ యాదవ్, మధుసూదన్ యాదవ్, దయాకర్ యాదవ్, సుభాష్ పటేల్, బాలు, రవీందర్ గౌడ్ సహా పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.
కాగడాల వెలుగులో సాగిన ఈ ప్రదర్శనలో సిక్కు సామాజిక వర్గ పెద్దలు భారీ సంఖ్యలో పాల్గొని జైకారా నినాదాలతో హోరెత్తించారు. అంబర్‌పేట ప్రధాన రహదారి గుండా సాగిన ఈ ప్రదర్శన ఆధ్యాంతం అత్యంత క్రమశిక్షణతో, భక్తిభావంతో సాగింది.



Comments
Post a Comment