భారత భద్రత.. రాజీలేని పోరాటం....

 'ఆపరేషన్ సింధూర్' మన దృఢ సంకల్పానికి నిదర్శనం: ప్రధాని మోదీ

కాచిగూడ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో "మన్ కీ బాత్" వీక్షించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నాయకులూ...



తూఫాన్(హైదరాబాద్) :- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'మన్ కీ బాత్' 129వ ఎపిసోడ్ ఆదివారం ప్రసారమైంది. కాచిగూడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని, పార్టీ శ్రేణులు, స్థానిక పారిశుధ్య కార్మికులతో కలిసి ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా 2025 ఏడాదిని భారతావనికి జాతీయ గర్వకారణమైన సంవత్సరంగా ప్రధాని అభివర్ణించారు.

దేశ భద్రత, సాంస్కృతిక వైభవానికి పెద్దపీట

దేశ రక్షణలో భారత్ రాజీలేని పోరాట పటిమను ప్రదర్శిస్తోందని, 'ఆపరేషన్ సింధూర్' ద్వారా మన జాతీయ భద్రతా దృఢత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పామని ప్రధాని పేర్కొన్నారు. వందేమాతరం గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అప్పటి దేశభక్తిని మరోసారి ప్రధాని స్మరించుకున్నారు. అలాగే 'తమిళం నేర్చుకుందాం - తమిళ కరకలం' చొరవ ద్వారా భాషా వైవిధ్యం, సాంస్కృతిక ఐక్యతను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.


క్రీడలు, అంతరిక్ష రంగాల్లో సంచలనం

భారత క్రీడాకారులు సాధించిన అద్భుత విజయాలను ప్రధాని కొనియాడారు. ఛాంపియన్స్ ట్రోఫీలో పురుషుల క్రికెట్ జట్టు విజయం, మహిళల ప్రపంచకప్ సాధన, అంధుల టీ20 ప్రపంచకప్ గెలవడం దేశానికి గర్వకారణమని అన్నారు. పారా అథ్లెట్ల ప్రతిభను కూడా ప్రత్యేకంగా ప్రశంసించారు. అంతరిక్ష రంగంలో శుభాన్షు శుక్లా ఐఎస్‌ఎస్‌కు వెళ్లడం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా చిరుతల సంతతి పెరగడం వంటి అంశాలను దేశ ప్రగతికి నిదర్శనాలని పేర్కొన్నారు.

పారిశుధ్య కార్మికుల గౌరవమే ధ్యేయం: కిషన్ రెడ్డి

కార్యక్రమం అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. గత 11 ఏళ్లుగా మన్ కీ బాత్ ద్వారా ప్రధాని వివిధ రంగాల ప్రముఖులను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంతో పారిశుధ్య కార్మికులకు సామాజిక గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని ప్రధాని కల్పించారని గుర్తుచేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు తమ నియోజకవర్గాల్లో పారిశుధ్య కార్మికులతో కలిసి స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను నిరంతరం చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.


ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.గౌతమ్ రావు, మాజీ మంత్రి భాజపా సీనియర్ నాయకులూ సి.కృష్ణ యాదవ్, కార్పొరేటర్లు అమృత, ఉమా రమేష్ యాదవ్, ప్రభారీ వీరెల్లి చంద్రశేఖర్, భాజపా సెంట్రల్ జిల్లా ఉపాధ్యక్షుడు అజయ్ కుమార్, బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు మరియు పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.












Comments

Popular posts from this blog

సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ గా బాధ్యతలను స్వీకరించిన సి.హెచ్. ప్రియాంక

లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి