మనసుకు శాంతిని, సమాజానికి మేధావిని ఇచ్చేది పుస్తకమే....
38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
తూఫాన్(హైదరాబాద్):- పుస్తక పఠనం అభ్యాసమైతే అది మనిషికి మానసిక ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా, గొప్ప మేధావిగా తీర్చిదిద్దుతుందని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో నిర్వహించిన ‘పుస్తక స్ఫూర్తి’ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. విద్యార్థులు ప్రతి స్టాల్‌ను సందర్శించి తమకు నచ్చిన పుస్తకాన్ని ఎంచుకోవాలని సూచించారు. పఠనం అనేది కేవలం సమాచారం కోసమే కాకుండా, మెదడుకు పదును పెట్టి విజ్ఞానాన్ని, ఆనందాన్ని పంచుతుందని చెప్పారు.
తన జీవిత ప్రయాణంలో ‘నెపోలియన్ ది గ్రేట్’ పుస్తకం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని, ఆయన నిఘంటువులో ‘అసాధ్యం’ అనే పదమే లేదన్న స్ఫూర్తితోనే తాను సమాజ సేవలో నిమగ్నమయ్యానని దత్తాత్రేయ తెలిపారు. ఎమర్జెన్సీ సమయంలో జైలులో ఉన్నప్పుడు భగవద్గీత తనకు జీవిత పరమార్థాన్ని బోధించిందని, కోవిడ్ వంటి విపత్కర కాలంలో మహాభాగవతం చదవడం వల్ల మానసిక ధైర్యం, శక్తి లభించాయని గుర్తుచేసుకున్నారు.
నేటికీ తాను రాత్రి వేళల్లో పఠనానికి సమయం కేటాయిస్తానని చెబుతూ.. మనం ఎంత ఎక్కువగా చదివితే అంత వినమ్రత పెరుగుతుందని, పేదలను సమానంగా చూసే సామాజిక దృక్పథం పుస్తకాల వల్లే సాధ్యమని స్పష్టం చేశారు. పుస్తక జ్ఞానం నైతిక విలువలను పెంచుతుందని, ప్రతి ఒక్కరూ పఠనాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.


editor balakrishna gari number ivvandi.. gsn raju sr journalist, balakrishna Old Friend
ReplyDeleteToofan Telugu Daily Editor Doneti Balakrishna Contact No:-9052210183
ReplyDelete