గచ్చిబౌలిలో 'ఓజ్రిట్' నూతన కార్యాలయం ప్రారంభం
తూఫాన్, హైదరాబాద్ :- ప్రముఖ సాఫ్ట్‌వేర్, ఐటీ సేవల సంస్థ 'ఓజ్రిట్ డాట్ కామ్' (Ozrit.com) గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన తన నూతన విభాగాన్ని బుధవారం ఘనంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) జ్యోతి ప్రజ్వలన చేసి నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు.
అనంతరం సంస్థలోని యువ సాంకేతిక నిపుణులు, ఉద్యోగులతో కేటీఆర్ కాసేపు ముచ్చటించారు. వారి పనితీరును, నూతన ఆవిష్కరణలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓజ్రిట్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ భరత్ గుప్తా, సహ వ్యవస్థాపకుడు, సీఓఓ వివేకానంద్ రెడ్డిలతో కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సంస్థ భవిష్యత్తు ప్రణాళికలు, ఐటీ రంగంలో వస్తున్న నూతన మార్పులపై చర్చించారు.


Comments
Post a Comment