అంబర్‌పేటలో బీజేపీ నియోజకవర్గ సమావేశం
తూఫాన్ హైదరాబాద్ :- అంబర్‌పేట నియోజకవర్గ బీజేపీ సమావేశం అదివారం ఉదయం 11 గంటలకు చె నంబర్ చౌరస్తాలోని రాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సమావేశంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గౌతమ్ రావు, మాజీ మంత్రి కృష్ణ యాదవ్ పాల్గొని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
వారితో పాటు జిల్లా ప్రభారి వీరెల్లి చంద్రశేఖర్, తెలంగాణ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు జి.ఆనంద్ గౌడ్, సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు దీపక్ రెడ్డి, సెంట్రల్ జిల్లా జనరల్ సెక్రటరీ అజయ్ కుమార్‌లతో పాటు వివిధ విభాగాల డివిజన్ అధ్యక్షులు, మోర్చా నాయకులు పాల్గొన్నారు. ఈ నియోజకవర్గ స్థాయి సమావేశంలో పెద్ద సంఖ్యలో మహిళా నాయకురాళ్లు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు.
Comments
Post a Comment