హనుమంతరావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన బండారు దత్తాత్రేయ

- ఆయురారోగ్యాలతో మరెన్నో ఏళ్లు ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్ష 



తూఫాన్, హైదరాబాద్:- రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. హనుమంతరావు నివాసానికి వెళ్లిన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి పుట్టినరోజు అభినందనలు అందజేశారు.

ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ... హనుమంతరావు సంపూర్ణ ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో మరెన్నో సంవత్సరాల పాటు ప్రజాసేవలో ముందంజలో ఉండాలని ఆకాంక్షించారు. రాజకీయాల్లో, ప్రజా జీవితంలో ఆయన సుదీర్ఘ కాలంగా అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.





Comments