ప్రకృతికి ఉన్న సమదృష్టియే హైందవ ధర్మం: సుందరకాండ శ్రీనివాస్ స్వామి

తూఫాన్,హైదరాబాద్(చిక్కడపల్లి) :- హైందవ ధర్మం సర్వ మానవులను జీవులను సమానం గా చూడమని బోధిస్తుందని సుందర కాండ ప్రచారకుడు ఆధ్యాత్మిక వేత్త సుందరకాండ శ్రీనివాస్ స్వామి అన్నారు ప్రకృతి  కి ఉన్న సమ దృష్టి  హైందవ ధర్మం కు మూలం అని ఆయన చెప్పారు శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదిక పై హిందూసమ్మేళనం సంచాలన సమితి నిర్వహణలో  హిందూ సమ్మేళనం జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీనివాస్ స్వామి మాట్లాడుతూ అఖండ భారత దేశ వేల సంవత్సరాల సంస్కృతి వారసత్వం కొనసాగించటం కోసం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం వంటి సంస్థలు పని చేస్తున్నాయి అని వివ రించారు సినీ నటి హరి కథా కళాకారిణి కరాటే కళ్యాణి మాట్లాడుతూ హైందవ మతం లో కులాల వారీ గా ప్రజలు చీలి పోయారు అని ఆవేదన వ్యక్తం చేశారు కుల రహిత సమాజం పతిష్ట కుటుంబ వ్యవస్థ స్వదేశీ భావన సంప్రదాయం అనుచరణ మాతృ దేశ భాష ల పట్ల అభిమానం ప్రతి భారతీయుడు ప్రాథమిక లక్షణం కావాలి అని చెప్పారు ఖాండవల్లి ఆదిత్య భరద్వాజ కీలక ప్రసంగం చేస్తూ అఖండ భారత దేశం అందరూ ఒక్కటి అన్న ఏకాత్మ భావన నేటి పరిస్థితి లో అత్యవసరం అని చెప్పారు సీనియర్ జర్నలిస్ట్ అఖిలేష్ సమ్మేళనం లక్ష్యాలు తెలిపారు ఈ సందర్భంగా ప్రముఖ నాట్య గురువు సంజని వల్లభనేని శిష్య బృందం కూచిపూడి నృత్య శైలిలో లింగాష్టకం సుందర కాండ అద్భుతం గా నర్తించారు.




 

Comments

Popular posts from this blog

జేఎన్‌జే జర్నలిస్ట్స్ భూములపై కుట్ర‌లా?

పుస్తకం.. అజ్ఞానపు చీకట్లను చీల్చే దారిదీపం....

యాదగిరిగుట్టలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు!