బాబాసాహెబ్ ఆశయ సాధనే లక్ష్యం కావాలి

- పి&టి కాలనీలో ఘనంగా అంబేడ్కర్ జయంతి 

- నివాళులర్పించిన టి. గోపాల్


తూఫాన్, హైదరాబాద్ :- భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ తమ జీవన మార్గంగా మలచుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకులూ టి. గోపాల్ పిలుపునిచ్చారు. మంగళవారం అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ పరిధిలోని పి&టి కాలనీలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం టి. గోపాల్ మాట్లాడుతూ.. దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు, గౌరవం కల్పించిన మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. ఆయన అందించిన రాజ్యాంగ ఫలాలు సమాజంలోని చివరి వ్యక్తికి కూడా అందినప్పుడే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బాబాసాహెబ్ చేసిన పోరాటం చిరస్మరణీయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో వాచస్పతి, సత్యం దొనేటి, ఇల్లీ శ్రీనివాస్, లక్ష్మీనారాయణ (బంటి), రవీందర్ గౌడ్, సురేష్, ఉల్లాస్ తదితర ప్రముఖులు పాల్గొని అంబేడ్కర్‌కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాలనీలో పండగ వాతావరణం నెలకొంది.





 

Comments

Popular posts from this blog

జేఎన్‌జే జర్నలిస్ట్స్ భూములపై కుట్ర‌లా?

పుస్తకం.. అజ్ఞానపు చీకట్లను చీల్చే దారిదీపం....

యాదగిరిగుట్టలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు!