బట్టి కార్మికులకు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు అందజేసిన డిప్యూటీ డిఎంహెచ్ఓ

  బట్టి కార్మికులకు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు అందజేసిన  డిప్యూటీ డిఎంహెచ్ఓ 



TOOFAN - JAGTIAL : టీబీ ముక్త్ భారత్ అభియాన్ 2.0 కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా నూకపల్లిలోని ఇటుక బట్టి కార్మికులకు, ప్రజలకు వైద్య శిబిరము నిర్వహించారు.నూకపల్లి ఇటుక బట్టి కార్మికులకు, ప్రజలకు స్పుటం కప్పులు, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు జగిత్యాల జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాస్ అందజేశారు.

ఈ వైద్య శిబిరానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఉప వైద్యాధికారి డా ఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా శ్రీనివాస్ మాట్లాడుతూ, క్షయ వ్యాధి బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సలహాలను సూచించారు. రెండు వారాలకు మించి దగ్గు, రాత్రిపూట చెమటలు పట్టడం, బరువు తగ్గడం, తెమడలో రక్తం పడటం, చాతిలో పట్టేసినట్టు ఉండడం ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి విచ్చేసి తగు పరీక్షలు చేయించుకొని మందులు వాడాల్సిందిగా సూచించారు.ఈ వైద్య శిబిరంలో  వైద్యాధికారులు, వైద్య సిబ్బంది   తదితరులు పాల్గొన్నారు. https://toofandailytelugu.blogspot.com/2026/04/april-26th-sunday-2026-e-paper-toofan.html

Comments

Popular posts from this blog

జేఎన్‌జే జర్నలిస్ట్స్ భూములపై కుట్ర‌లా?

పుస్తకం.. అజ్ఞానపు చీకట్లను చీల్చే దారిదీపం....

యాదగిరిగుట్టలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు!